హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణం తీసిన బైక్ ఫోటోగ్రఫీ: 500 మందికి హామీ ఇచ్చి, 50 మందినే తీసుకు రావడంతో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యువతకు బైక్‌లు అంటే పిచ్చి. ఆ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఖరీదైన బైక్‌లను అద్దెకు ఇస్తూ ఫోటోలు తీసి ఇచ్చే బైక్ ఫోటోగ్రఫీ అనే సంస్థ విద్యార్థి వంశీకృష్ణ స్నేహం చేశాడు. ఆ బైక్‌లపై ఉన్న సరదా చివరకు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ విషాధ సంఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది.

వంశీకృష్ణ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ బైక్ ఫోటోగ్రఫీ సంస్థతో అతనికి పరిచయం ఉంది. బైక్ ఫైన ఫోటోలు దిదేందుకు 500 మందిని తీసుకు వస్తానని బైక్ ఫోటో గ్రఫీ ఈవెంట్ ఆర్గనైజర్‌కు చెప్పాడు. ఒక్కొక్కరి వద్ద రూ.350 తీసుకుంటామని చెప్పారు.

Bike photography takes on live in Hyderabad

ఈ నెల 29వ తేదీన ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం నిర్వహించారు. వంశీతో పాటు మరికొందరు ప్రచారం చేశారు. 500 మందిని తీసుకువస్తానని చెప్పిన అతను చాలా తక్కువ మందిని తీసుకు వచ్చాడు.

అయితే వంశీ కేవలం 50 మందినే తీసుకు వచ్చాడు. దీంతో మిగతా 450 మందికి సంబంధించిన రూ.లక్షకు పైగా డబ్బు చెల్లించాలని బైక్ ఫోటో గ్రఫీ ఈవెంట్ ఆర్గనైజర్లు చెప్పారు. వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవల్ల నష్టం జరిగిందని, అ డబ్బు ఎవరు చెల్లిస్తారని, నీవే ఇవ్వాలని చెప్పాడు.

ఈ విషయం ఇంట్లో తెలిస్తే కష్టమని భావించిన వంశీ, అంత డబ్బు తేలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ తండ్రి చిన్న ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతనేమో చదువుకుంటున్నాడు.

English summary
Bike photography takes on live in Hyderabad on Sunday. College student Vamshi failed in his promise to Photography event organiser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X