వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమా మాధవ రెడ్డి వర్గం వేధింపు, బిల్యా నాయక్ రిజైన్: 'స్మార్ట్ సిటీ వద్దన్న కెసిఆర్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

నల్గొండ: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది! పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉమా మాధవ రెడ్డి వర్గం వేధిస్తోందని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా టిడిపి అధ్యక్షులు బిల్యా నాయక్ తన పదవికి ఆదివారం నాడు రాజీనామా చేశారు.

ఉమా మాధవ రెడ్డి వర్గం వేధింపుల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు బిల్యా నాయక్ చెప్పారు. బిల్యా నాయక్‌ను మూడేళ్ల క్రితం టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు.

Bilya Nayak resigns as TDP Nalgonda president

స్మార్ట్ సిటీ ఇస్తామంటే వద్దన్న సీఎం: దత్తాత్రేయ

హైదరాబాద్ నగరం మరింతగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నట్టుగా తనకు అనిపించడం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శఇంచారు. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామంటే కేసీఆర్ వద్దని చెప్పారన్నారు.

ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. నగర అభివృద్ధి కోసం, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిని గెలిపించాలని దత్తాత్రేయ కోరారు. గ్రేటర్ పీఠాన్ని బీజేపీ కూటమి దక్కించుకుంటే, మరింతగా అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను టీఆర్ఎస్ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

English summary
Bilya Nayak resigns as TDP Nalgonda president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X