వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మెట్రో' ఎక్కకుండానే!: షాక్ తిన్న ప్యాసింజర్.., ఇలా చేస్తే స్మార్ట్ కార్డు బ్యాలెన్స్ గోవిందా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyd Metro smart card balance deducted automatically,Metro journey rules

హైదరాబాద్: బుధవారం నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో.. రాజధాని ప్రజలు మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తొలిసారిగా మెట్రోలో జర్నీ చేసి.. ఆ జ్ఞాపకాలను సెల్ఫీల రూపంలో పదిలపరుచుకుంటున్నారు.

తొలిసారి మెట్రో జర్నీ వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. బుధవారం తెల్లవారుజామున 5గం. నుంచే మెట్రో స్టేషన్లకు తాకిడి మొదలైంది. స్మార్ట్ కార్డు కౌంటర్స్ కిటకిటలాడాయి. తొలిరోజు మెట్రో జర్నీ చాలామందికి కొత్త అనుభవాన్ని మిగల్చగా.. కొద్దిమందికి మాత్రం చేదు అనుభవం తప్పలేదు.

 తొలి రోజు జర్నీ:

తొలి రోజు జర్నీ:

ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ తొలిరోజు మెట్రో జర్నీ చేయాలన్న ఆత్రుతతో నాగోల్‌ స్టేషన్‌కు వెళ్లాడు. రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు తీసుకున్నాడు. ఇందులో రూ.100 మెట్రో ప్రయాణానికి వాడుకోవచ్చు. ప్లాట్ ఫామ్ పైకి వెళ్లాక అంతా కలియతిరుగుతూ దాదాపు గంట సమయం పాటు అక్కడే గడిపాడు శ్రీనివాస్.

 చేదు అనుభవం:

చేదు అనుభవం:

ఎక్కువసేపు ప్లాట్ ఫామ్ పై గడపడంతో శ్రీనివాస్ స్మార్ట్ కార్డులోని రూ.100 కాస్త రూ.12కి వచ్చింది. మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చేముందు కార్డులో బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఈ విషయం తెలిసింది. దీంతో శ్రీనివాస్ షాక్ తిన్నాడు. మెట్రో రైలు ఎక్కకుండానే రూ.88 ఖర్చవడం అతనిని షాక్ కు గురిచేసింది.

29నిమిషాల్లోపు వస్తేనే!: మెట్రో ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే.., వాటిపై నిషేధం!29నిమిషాల్లోపు వస్తేనే!: మెట్రో ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే.., వాటిపై నిషేధం!

 29నిమిషాల్లోపే:

29నిమిషాల్లోపే:

మెట్రో ప్రయాణికులు ముందస్తుగా జారీ చేసిన సూచనలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా ఉంటాయి. స్టేషన్ లోకి ప్రవేశించిన 29నిమిషాల్లోపే మెట్రో రైలు ఎక్కాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువసేపు స్టేషన్ లోనే ఉండిపోతే స్మార్ట్ కార్డు నుంచి డబ్బులు కట్ అయ్యే అవకాశాలున్నాయి.

వరల్డ్ టాప్ 'మెట్రో' ఇవే: వాళ్లు మనకన్నా స్పీడ్.., ఇండియా స్థానమెక్కడ?...వరల్డ్ టాప్ 'మెట్రో' ఇవే: వాళ్లు మనకన్నా స్పీడ్.., ఇండియా స్థానమెక్కడ?...

 క్లారిటీ అవసరం:

క్లారిటీ అవసరం:

మెట్రో జర్నీ చేయకపోయినా స్మార్ట్ కార్డు నుంచి డబ్బులు కట్ అవడంపై ప్రయాణికులకు మరింత స్పష్టతనివ్వాల్సి ఉంది. తొలిసారి మెట్రో స్టేషన్లలోకి అడుగుపెడుతుండటంతో ప్రయాణికులు చాలామంది అక్కడ ఎక్కువసేపు గడపడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మెట్రో యాజమాన్యం దీనిపై స్పష్టతనిస్తే ప్రయాణికులు అప్రమత్తమవుతారు.

English summary
A metro train passenger faced a bitter experience on the first day of journey, by spenting more time in metro station his smart card balance was automatically deducted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X