వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థికి నిరసన సెగ .. స్వగ్రామంలో ప్రచారానికి నో రెస్పాన్స్

|
Google Oneindia TeluguNews

వరంగల్ ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ కు సొంత గ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది. గులాబీ పార్టీ నుండి విధేయతకు పట్టం కడుతూ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కు మరోమారు టికెట్ ఇచ్చే అవకాశం కల్పించారు గులాబీ బాస్ కేసీఆర్. అయితే ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్న పసునూరి దయాకర్ స్వగ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే పట్టుమని 50 మంది గ్రామస్తులు కూడా రాకపోవడం షాక్ కు గురి చేస్తుంది. అంతేకాదు గ్రామంలోని సమస్యలపై నిలదీసిన గ్రామస్తులు అసహనంతో అక్కడి నుండి వెళ్లిపోవడం ఎంపీ పనితీరుకు అద్దం పడుతుంది.

 కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే ...5 లక్షల మెజార్టీ తో గెలిపించే బాధ్యత మీదే అన్న కేటీఆర్ <br> కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టే ...5 లక్షల మెజార్టీ తో గెలిపించే బాధ్యత మీదే అన్న కేటీఆర్

 నామినేషన్ దాఖలు చేసిన వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్

నామినేషన్ దాఖలు చేసిన వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్

వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి, శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తదితరులు హాజరయ్యారు నేడు నామినేషన్లు వేయడానికి చివరి రోజు కావడంతో పసునూరి దయాకర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు.

 పనితీరు పెద్దగా లేకున్నా .. కేసీఆర్ కు విధేయుడు ..

పనితీరు పెద్దగా లేకున్నా .. కేసీఆర్ కు విధేయుడు ..


గత ఉప ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన పసునూరి దయాకర్ తన పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేనప్పటికీ సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. కెసిఆర్ పట్ల విధేయత చూపించే దయాకర్ ఆ విధేయత తోనే మరోమారు టికెట్ సంపాదించారని టాక్ ఉంది. అయితే మళ్లీ పార్లమెంట్ ఎన్నికల బరిలో అభ్యర్థిగా పోటీలో ఉన్న దయాకర్ కు స్వగ్రామమైన బొల్లి కుంట గ్రామంలో నిరసన సెగ తగిలింది.

స్వగ్రామం బొల్లికుంటలో నిరసన సెగ .. సమస్యలపై నిలదీత

స్వగ్రామం బొల్లికుంటలో నిరసన సెగ .. సమస్యలపై నిలదీత

సొంతూరిలో నిర్వహించిన ప్రచార సభ కు కనీసం 50 మంది కూడా రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బొల్లికుంట లోని తాగునీటి, సాగునీటి సమస్యను పరిష్కరించలేదని, బొల్లికుంట ను మండల కేంద్రంగా మార్చడానికి కృషి చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో పట్టించుకోలేదని , ప్రభుత్వ పథకాలు గ్రామస్తులకు అందకున్నా ఎవరూ పట్టించుకోలేదని ప్రచారానికి వచ్చిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ని, ఎంపీ పసునూరి దయాకర్ నిలదీశారు గ్రామస్తులు. దీంతో ఆదిలోనే హంసపాదు అన్న చందంగా సొంత గ్రామంలో పసునూరి దయాకర్ కు చేదు అనుభవం ఎదురైంది.

English summary
TRS party candidate Pasuruni Dayakar, who was elected as the Warangal MP, faced a bitter experience in his own village. At least 50 people did not even attend the campaign in the own village Bollikunta . The villagers were quentioned him about their problems in the campaign. Dayakar and MLA Challa Dharmareddy return back with disappointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X