వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరి చేదు నిజాలు: వడ్రంగి పనికి నెలకు రూ.1 జీతం, పార్టీ పెట్టి ఫెయిల్

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని ప్రతిభను ఎప్పటికప్పుడు పరిశ్రమకు పరిచయం చేసిన దాసరి నారాయణ రావు తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని ప్రతిభను ఎప్పటికప్పుడు పరిశ్రమకు పరిచయం చేసిన దాసరి నారాయణ రావు తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 150కి పైగా చిత్రాలకు తెరకెక్కించారు.

చదవండి: దాసరి మృతి: వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు

అలాగే నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించారు. 250కి పైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించారు. మామగారు, సూరిగాడు, 'అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, మేస్త్రీ, ఎర్రబస్సులాంటి చిత్రాల్లో నటించారు.

అన్నింటా సక్సెస్

అన్నింటా సక్సెస్

వర్తమాన, సామాజిక అంశాలే ఇతివృత్తంగా తన చిత్రాలను తెరకెక్కించారు. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క సారక్క వంటి చిత్రాల ద్వారా ఎలుగెత్తి చాటారు. చాలామంది అభిమానులున్నారు. రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రిగా ఎదిగారు.

నటుడి, పాటల రచయిత

నటుడి, పాటల రచయిత

నటుడి, పాటల రచయిత, మాటల రచయిత, రంగస్థల నటుడు, గిన్నిస్ బుక్‌కెక్కిన దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త, పాత్రికేయుడు పత్రికాధిపతి, వ్యాసరచయిత, వ్యంగ్య రచయిత, రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రి.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాసరి.. ఒకప్పుడు వండ్రంగి పని చేశాడు. జీతం నెలకు ఒక రూపాయి తీసుకున్నాడు.

ఈనాడుకు చుక్కలు చూపించి, ఎన్టీఆర్‌తో వారిని మెప్పించి

ఈనాడుకు చుక్కలు చూపించి, ఎన్టీఆర్‌తో వారిని మెప్పించి

1947 మే 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో దాసరి పుట్టారు. ఈనాడుకు ముచ్చెమటలు పట్టించిన ఉదయం ఆయన తీసుకు వచ్చిన పత్రిక. ఓ సామాజిక వర్గమే పెత్తనం చెలాయించే చిత్రసీమలో అదే సామాజిక వర్గాన్ని మెప్పించి, ఎన్టీఆర్ వంటి నటుడికి రాజకీయ ఎంట్రీకి సరిపడా చిత్రాలు అందించారు దాసరి.

అక్కడే డౌన్ ఫాల్

అక్కడే డౌన్ ఫాల్

ఆయనకు ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. కుటుంబం పొగాకు వ్యాపారం చేసింది. ఓసారి గోడౌన్ తగలబడింది. దీంతో డౌన్ ఫాల్ అయింది. ఆస్తులు అమ్మేశారు. తండ్రికి ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. దాసరి మూడోవాడు. వాళ్ల నాన్న తరం వరకు ఎవరూ చదువుకోలేదు. దాసరిని మాత్రం తండ్రి చదివించారు.

వడ్రింగి వద్ద పనికి

వడ్రింగి వద్ద పనికి

ఆరో తరగతికి వచ్చేసరికి పరిస్థితి తారుమారు అయింది. స్కూల్ ఫీజు రూ.3 కట్టేందుకు కూడా కష్టంగా ఉండేది. తండ్రి దాసరిని బడి మాన్పించి వడ్రంగి దుకాణంలో చేర్పించాడు. అక్కడ నెలకు రూపాయి జీతానికి చేరాడు.

అజ్ఞాత వ్యక్తి సాయం

అజ్ఞాత వ్యక్తి సాయం

వడ్రంగి పనుల్లో ఉన్న దాసరికి ఓ అజ్ఞాత దాత, ఓ మాస్టారు సహకారంతో బడిలో చేరారు. బీఏ దాకా చదివారు. కళాశాల నుంచి నాటకాలు వేసేవాడు. అందరికీ తలలో నాలుక అయ్యాడు.

జాతీయస్థాయి గుర్తింపు

జాతీయస్థాయి గుర్తింపు

తాత మనవడు, స్వర్గం నరకం వంటి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటాడు. మేఘసందేశంతో జాతీయస్థాయి గుర్తింపు పొందాడు. దాసరిది తెలుగు పరిశ్రమలో ఓ శకం. ఓ దశలో ఆయనకు 18వేల అభిమాన సంఘాలు ఉండేవి. హీరోలకు దీటుగా దర్శకుడికి పేరు తెచ్చాడు.

రాజకీయ పార్టీ స్థాపించి విఫలం..

రాజకీయ పార్టీ స్థాపించి విఫలం..

1990వ దశకంలో తెలుగుతల్లి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన దాసరి నారాయణ రావు విఫలమయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సన్నిహితులయ్యారు. చివరి క్షణం వరకు అందులోనే ఉన్నారు. ఉదయం పత్రిక తెలుగునాట సంచలనం.

అప్పటి దాకా పెద్ద సర్క్యులేషన్‌తో ఉన్న ఈనాడుకు కంట్లో నలుసు అయ్యారు. తెలుగు సినిమాలు, పత్రికలు, తెలుగు రాజకీయాల్లో దాసరి నారాయణ రావుది విస్మరించలేని ముద్ర.

English summary
Dasari Narayana Rao, well known filmmaker and producer, has died. He was 75 years old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X