హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ పెట్టుబడులు: జపాన్, ఆస్ట్రేలియా, చైనా ప్రతినిధులతో జూపల్లి(పిక్చర్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పారిశ్రామికరంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆసియాలోనే ఉన్నత స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పారిశ్రామికవేత్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, భారీ పెట్టుబడులతో తెలంగాణకు రావాలని విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

గురువారం సచివాలయంలో ఆస్ట్రేలియా, చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా ప్రతినిధులతో మంత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను, ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌ గురించి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రమని, భారీ, చిన్న తరహా సహా ఏ రకమైన పరిశ్రమ స్థాపించేందుకైనా ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అందుకు లక్షా 50 వేల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్, అన్నిరకాల నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

పెట్టుబడులు పెట్టే సంస్థల స్థాయిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తుందని తెలిపారు. కొన్ని కంపెనీలు లేదా దేశాలు కలిసి గ్రూప్‌గా సంస్థలు ఏర్పాటు చేయాలనుకుంటే అందుకు తగినవిధంగా అన్ని వసతులతో వనరులను ఒకేచోట సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

పారిశ్రామికరంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆసియాలోనే ఉన్నత స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

పారిశ్రామికవేత్తలే తమ బ్రాండ్ అంబాసిడర్లని, భారీ పెట్టుబడులతో తెలంగాణకు రావాలని విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

గురువారం సచివాలయంలో ఆస్ట్రేలియా, చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా ప్రతినిధులతో మంత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను, ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌ గురించి వివరించారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

ఈ సమావేశాల్లో ఆస్ట్రేలియా ఎంపీ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ పార్లమెంటరీ సెక్రెటరీ స్టీవెన్ సియోబొ, ఆ దేశ హైకమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్, ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్ సీన్‌కెల్లి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, కమిషనర్ మాణికరాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ, వీసీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రమని, భారీ, చిన్న తరహా సహా ఏ రకమైన పరిశ్రమ స్థాపించేందుకైనా ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

అందుకు లక్షా 50 వేల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్, అన్నిరకాల నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

విదేశీ ప్రతినిధులతో జూపల్లి

పెట్టుబడులు పెట్టే సంస్థల స్థాయిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తుందని తెలిపారు.

మౌలిక వసతుల్లో హైదరాబాద్‌ను మరో నాలుగైదేళ్లలో డల్లాస్‌గా మార్చాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో మొబైల్ తయారీ కంపెనీలు యూనిట్లు స్థాపించేందుకు మంచి అవకాశాలున్నాయని పరిశ్రమలశాఖ సెక్రెటరీ అరవింద్‌కుమార్ వివరించారు.

మొబైల్ తయారీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, కార్బన్ కంపెనీలు ఇప్పటికే హైదాబాద్‌లో యూనిట్‌లను ప్రారంభించేందుకు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం టిఎస్ ఐపాస్‌ను ఆస్ట్రేలియా బృందం అభినందించింది. పారిశ్రామికీకరణ వైపు తెలంగాణ వేస్తున్న అడుగులు ఎంతో బాగున్నాయని స్టీవెన్ అన్నారు.

English summary
Business and official delegations from Australia, Japan, Taiwan and other countries met industries minister Jupally Krishna Rao here on Thursday and discussed about investment opportunities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X