వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వమా నీవెక్కడ..? కూతురిపై తల్లి, సోదరిపై అన్న రాళ్లతో దాడి, ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

కలికాలంలో మానవత్వానికి చోటు లేదు. మంచి మనసు అన్నదే లేదు. తమ తర అనే విషయమే మరచిపోయారు. ఔను నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనతో ఇది మరోసారి రుజువయ్యింది. సొంత కూతురిపై తల్లి, తన రక్తం పంచుకొని పుట్టిన సోదరిపై అన్న దారుణంగా ప్రవర్తించారు. రాళ్లతో దాడి చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇంతకీ ఆ యువతి చేసిన తప్పేంటో తెలుసా..? పెళ్లి చేసి, భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోరడమే. ఆ వెంటనే తల్లి, సోదరుడు పారిపోవడంతో స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు.

 పీజీ చేసి..

పీజీ చేసి..

నల్గొండ జిల్లా వెలగలగూడెనికి చెందిన కవిత పీజీ పూర్తి చేశారు. ఆమె 32 ఏళ్లు వచ్చిన పెళ్లి చేయాలని పెద్దలు అనుకోలేదు. దీంతో ఆమెను తనకు వివాహం చేయాలని కోరారు. ఈ ఇష్యూ ఘర్షణకు దారితీసింది. కవితకు పెళ్లి చేస్తే కట్నంతోపాటు భూమి ఇవ్వాల్సి వస్తోంది అనుకొన్నారు. దీనికితోడు పెళ్లి చేయాలని ఆమె బలవంతం చేయడంతో.. ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్నారు. రేపు మాపు అని చెప్పి.. సమయం గడిపారు.

పెళ్లి కోసం

పెళ్లి కోసం

పెళ్లి విషయమై శుక్రవారం కూడా తల్లి, సోదరుడితో గొడవ జరిగింది. దీంతో కవితపై పీకల దాకా కోపం పెంచుకున్న వారు.. రాళ్లతో దాడి చేశారు. తన తల్లి, సోదరుడే దాడి చేయడంతో ఏం జరుగుతుందో ఆమెకు తెలియరాలేదు. ఆమె తెరుకునేలోపు తీవ్రగాయాల పాలయ్యారు. దాడి చేసి తల్లి, సోదరుడు పారిపోయారు. ఇంటి వద్ద పడి ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కవిత తల్లి, సోదరుడి కోసం గాలిస్తున్నారు.

విషమంగా..

విషమంగా..

ప్రస్తుతం నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కవిత చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కూతురి పెళ్లి చేయొద్దని ఉద్దేశంతో దాడి చేశారు. దాడి చేసి పంపిస్తే.. పెళ్లి, భూమి వాటా అని అడగబోదని అనుకొన్నారు.

 భూమిలో వాటా

భూమిలో వాటా

ఏడెకరాల భూమి కూడా ఉంది. అందులో తన వాటా ఇచ్చి పెళ్లి చేయాలని కవిత కోరుతోంది. పెళ్లి చేస్తాం కానీ.. భూమి మాత్రం ఇవ్వబోమని తల్లి, సోదరుడు తేల్చిచెప్పారు. ఈ విషయంపైనే శుక్రవారం ఉదయం వారి మధ్య వాదనకు దారితీసింది. కోపోద్రిక్తులైన తల్లి, సోదరుడు రాళ్లతో దాడి చేశారు. దీంతో కవిత ప్రాణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో పోరాడుతున్నారు.

English summary
mother and brother attack kavitha for she is asking marriage and land registration. incident at nalgonda district velagala gudem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X