వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబ్బాకలో బీజేపీ జూటా గేమ్...దిగజారుడు రాజకీయం.. ఇదిగో 10 అబద్దాలు...: హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

జూటా మాటలతో... గోబెల్స్ ప్రచారంతో దుబ్బాక ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. పూటకో పుకారు... గంటకో అబద్దంతో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మొదలు కింది స్థాయి కార్యకర్తల వరకూ అంతా అసత్యాలే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందన్న చందాన ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. అబద్దమే ఆయుధంగా... అబద్ద పునాదుల మీద దుబ్బాకలో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ నాయకుల జూటా మాటలు వింటే మోసపోతామని... గోస పడుతామని... దుబ్బాక ప్రజలకు హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫించన్లలో సింహ భాగం కేంద్రమే ఇస్తోందని అబద్దాలు ప్రచారం చేశారని... దానిపై చర్చకు సవాల్ చేస్తే తోక ముడిచారని విమర్శించారు. ఆదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్ ఎంపీ స్థానాలను గెలిచిన బీజేపీ... ఆ నియోజకవర్గాలకు ప్రత్యేక ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు తెస్తామన్న హామీతో ఎన్నికల్లో గెలిచి... ఇప్పటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు.

జూటా నంబర్ 1.. జూటా నంబర్ 2...

జూటా నంబర్ 1.. జూటా నంబర్ 2...


టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేనివిధంగా బీడీ కార్మికులకు రూ.2116 ఫించన్ ఇస్తోందని హరీశ్ రావు తెలిపారు. కానీ ఇందులో రూ.1600 కేంద్రమే ఇస్తోందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్చకు తాను సవాల్ విసిరితే... ఇప్పటివరకూ జవాబు లేదన్నారు. బీడీ కార్మికులకు కాంగ్రెస్ పుర్రె గుర్తును ఇస్తే... బీజేపీ 18శాతం జీఎస్టీతో భారం మోపిందన్నారు. ఒక్క టీఆర్ఎస్ మాత్రమే వారికి రూ.2116 ఫించన్ ఇచ్చి... వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందోన్నారు. కేసీఆర్ కిట్ పథకంలోనూ రూ.6వేలు కేంద్రం ఇస్తోందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్‌కు కేంద్రం నయా పైసా ఇవ్వట్లేదని... ఇది నూటికి నూరు శాతం టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకమని స్పష్టం చేశారు.

జూటా నంబర్ 3... జూటా నంబర్.. 4

జూటా నంబర్ 3... జూటా నంబర్.. 4

టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపడితే... అందులోనూ ఒక యూనిట్‌కు రూ.50వేలు కేంద్రమే ఇస్తోందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అసలు ఒక యూనిట్‌కు అయ్యే ఖర్చుపై కూడా బీజేపీకి కనీస అవగాహన లేదన్నారు.ఒక మనిషికి గొర్రె పిల్లలు ఇచ్చేందుకు ఒక యూనిట్ ధర రూ.1,25,000 అని... ఇందులో 75శాతం,అంటే.. రూ.93750 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. మిగతా 25శాతాన్ని లబ్దిదారుడు భరిస్తున్నట్లు చెప్పారు. ఇది నూటికి నూరు శాతం టీఆర్ఎస్ ప్రభుత్వ పథకమన్నారు. రేషన్ సబ్సిడీలోనూ రూ.29 కేంద్రం ఇస్తోందని రూ.1 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. కానీ సగం మాత్రమే కేంద్రం భరిస్తోందని... మిగతా సగం ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పైగా కేంద్రం ఐదు కేజీల బియ్యం మాత్రమే ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వం మరో కేజీ కలిపి ఆరు కిలోలు అందిస్తోందన్నారు. కేంద్రం రూ.3కి కిలో చొప్పున ఇస్తే రాష్ట్రం రూ.1కే కిలో చొప్పున ఇస్తోందన్నారు.

జూటా నంబర్ 5.. జూటా నంబర్ 6..

జూటా నంబర్ 5.. జూటా నంబర్ 6..

ఇటీవల ఓ బీజేపీ ఎంపీ చేగుంట సభలో మాట్లాడుతూ... రూ.25కోట్లుతో మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రిని గజ్వేల్‌కు తరలించుకుపోయారని ఆరోపించినట్లు చెప్పారు. అదే నిజమైతే గజ్వేల్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిని చూపించాలని... లేదా చేగుంటకు ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైన కాగితం చూపించాలని హరీశ్ రావు సవాల్ విసిరారు. దుబ్బాకకు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరైతే... దాన్ని సిద్దిపేటకు తరలించుకుపోయినట్లు ఆరోపిస్తున్నారన్నారు. అదే నిజమైతే దుబ్బాకలో పాలిటెక్నిక్ కాలేజీ కోసం వేసిన శిలాఫలకం చూపించగలరా అని ప్రశ్నించారు. అసలు దుబ్బాకకు పాలిటెక్నిక్ కాలేజే మంజూరు కాలేదని స్పష్టం చేశారు.

జూటా నంబర్ 7..

జూటా నంబర్ 7..

ముఖ్యమంత్రి కేసీఆరే రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని చూస్తున్నాడంటూ మరో అబద్ద ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం నూతన విద్యుత్ ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే ఎఫ్ఆర్‌బీఎం పరిధిని 0.25శాతానికి పెంచుతామని చెప్పింది బీజేపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అన్యాయం చేయవద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ దివాళాకోరు,దిక్కుమాలిన,దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు.

జూటా నంబర్ 8..

జూటా నంబర్ 8..

తెలంగాణ రైతుల వరి ధాన్యాన్ని కేంద్రమే కొంటున్నదని... ఇందుకోసం రూ.5500 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఇందుకోసం కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. ఇటీవల సిద్దిపేటలో పోలీసుల సోదాల విషయంలోనూ బీజేపీ అబద్దాలు ప్రచారం చేసిందన్నారు. అసలు ఆ ఇల్లు తమకి చెందినది కాదని ప్రచారం చేసుకుందన్నారు. అలాంటప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడ్డారని... ఆ ఇంటి వద్దకు వచ్చి ఎందుకు హడావుడి చేశారని ప్రశ్నించారు.

Recommended Video

Dubbaka Bypoll 2020 : Jaggareddy On Harish Rao ముంపు గ్రామాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది..
జూటా నంబర్ 9.. జూటా నంబర్ 10...

జూటా నంబర్ 9.. జూటా నంబర్ 10...

ఆరోజు నాలుగు ఇళ్ల మీద మాత్రమే పోలీసులు సోదాలు చేశారని... కానీ బీజేపీ 8 ఇళ్లు అని అబద్దం ప్రచారం చేసిందన్నారు. అందులోనూ రెండు ఇళ్లు టీఆర్ఎస్ నేతలకు చెందినవి కాగా... మరో రెండు ఇళ్లు బీజేపీ నేతలకు చెందినవిగా చెప్పారు. ఇక పోలీసులే ఆ ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టారని మరో అసత్య ప్రచారం చేశారని... తీరా పోలీసులు విడుదల చేసిన వీడియోలతో.. వారికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి తలెత్తిందన్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్త,మామ.. ఆ డబ్బు డ్రైవర్ తెచ్చి ఇంట్లో పెట్టినట్లు చెప్పారని పేర్కొన్నారు. అలాంటిది పోలీసులే అక్కడికి డబ్బులు తీసుకొచ్చారని గోబెల్స్ ప్రచారం చేయడమే కాకుండా... వారి పైనే దాడికి దిగారని ఆరోపించారు.

English summary
Telangana minister Harish Rao hold a press meet on Dubbaka by poll,he alleged that BJP promoting 10 lies in the election campaign. He explained the lies of BJP promoting in the name of central government schemes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X