వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దత్తన్నకు మొండిచేయి, కిషన్‌రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 7 స్థానాలకు క్యాండెట్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

దత్తాత్రేయ ఔట్ : కిషన్ రెడ్డి ఇన్

దత్తాత్రేయ ఔట్ : కిషన్ రెడ్డి ఇన్

కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయకు టికెట్ దక్కలేదు. వివిధ సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా దత్తాత్రేయకు మొండిచేయ్యి ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ యువనేత కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇక ఇటీవలే బీజేపీలో చేరిన ఫైర్ బ్రాండ్ డీకే అరుణను మహబూబ్ నగర్ టికెట్ దక్కింది. ఆమెకు టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి నుంచి పోటీ నెలకొంది.

కరీంనగర్ నుంచి బండి

కరీంనగర్ నుంచి బండి

కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్ పేరును ఖరారు చేసింది. చాల రోజుల తర్వాత కరీంనగర్‌లో బీజేపీ బలోపేతమైనట్టు కనిపిస్తోంది. ఇదివరకు ఇక్కడినుంచి సీహెచ్ విద్యాసాగర్ రావు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నిల్లో కరీంనగర్ నుంచి పోటీచేసిన బండి సంజయ్ కుమార్ మెజార్టీ ఓట్లను సాధించారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పొన్నం ప్రభాకర్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి .. తానంటే ఏంటో నిరూపించుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ అభ్యర్థిత్వానికే బీజేపీ హైకమాండ్ మొగ్గుచూపింది.

ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

మల్కాజిగిరి నుంచి రాంచందర్ రావు

మల్కాజిగిరి నుంచి రాంచందర్ రావు

ఇక మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ రాంచందర్ రావు బరిలోకి దిగుతున్నారు. అతి పెద్ద నియోజకవర్గానికి బీజేపీ పెద్దలు ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీలో నిలువగా .. టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండనుంది. నాగర్ కర్నూలు నుంచి బంగారు స్మృతికి టికెట్ కన్ఫామ్ చేశారు.

ఇందూరు నుంచి అరవింద్

ఇందూరు నుంచి అరవింద్

పోరుగలు ఓరుగల్లు టికెట్ ను చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ హుసేన్ నాయక్, నల్గొండ జితేంద్రకుమార్, భువనగిరి శ్యాం సుందర్ టికెట్ కేటాయించారు. నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ నేత డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ బరిలోకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తిచేశారు. అయితే టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ గౌడ్ పోటీ చేస్తున్నందున ... ఇక్కడ హోరాహోరీ నెలకొనే అవకాశం ఉంది.

English summary
The BJP has announce Lok Sabha candidates. The first list was released with 184 people. Ten candidates in Telangana state have announced candidates. Candidates should be disclosed to 7 other locations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X