• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీలో 'వివేక్ వెంకటస్వామి'పై వ్యతిరేకత-జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసే యోచన...?

|

తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ వివేక్ వ్యవహారంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో వివేక్ ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వివేక్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని... తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను విస్మరిస్తున్నారని అక్కడి కార్యకర్తలు,నేతలు వాపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు,త్వరలోనే ఆయనపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసే యోచనలో ఆ నేతలు ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది.

ఎందుకీ వ్యతిరేకత...?

ఎందుకీ వ్యతిరేకత...?


కొద్దిరోజుల క్రితం వివేక్‌కి వ్యతిరేకంగా పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లోని స్థానిక బీజేపీ నేతలు,కార్యకర్తలు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివేక్ వ్యవహార శైలిని వారు తీవ్రంగా ఎండగట్టారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన వివేక్... దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తమను విస్మరిస్తున్నారని ఈ సందర్భంగా నేతలు వాపోయారు. తమను కాదని,సొంత కేడర్‌తో పార్టీ సమావేశాలు,కార్యక్రమాలు నిర్వహించడమేంటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే త్వరలో వివేక్‌పై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని అక్కడి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కోటరీ మార్చిన వివేక్...?

కోటరీ మార్చిన వివేక్...?


ఇటీవల వివేక్ తన కోటరీని కూడా మార్చారని బీజేపీలోనే అంతర్గత గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నా,మొన్నటిదాకా బండి సంజయ్‌కి దగ్గరగా మెలిగిన ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోటరీలో చేరిపోయారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి వివేక్ బీజేపీలో చేరిన సమయంలో రాజ్యసభ పదవి లేదా కేంద్ర కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవి హామీతో పార్టీలో చేరినట్లు చెబుతారు. బండి సంజయ్‌ని నమ్ముకుంటే పదవి వచ్చే అవకాశం లేదని భావించిన వివేక్... కిషన్ రెడ్డి కోటరీలోకి మారిపోయారన్న చర్చ జరుగుతోంది.

ఈటల చేరికలో కీలకంగా వివేక్...

ఈటల చేరికలో కీలకంగా వివేక్...

మాజీ మంత్రి ఈటల బీజేపీ చేరికలోనూ వివేక్ కీలక పాత్ర పోషించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటలతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటం... టీఆర్ఎస్‌లో ఉన్నప్పటి సంబంధాల రీత్యా ఈటల బీజేపీ చేరిక వ్యవహారాన్ని ఆయనే ముందుండి నడిపించారు. ఈటల-కిషన్ రెడ్డి మధ్య ఫామ్ హౌస్ మీటింగ్‌కి అంతా తానై వ్యవహరించారు. ఆ తర్వాత ఈటల ఢిల్లీ టూర్‌లోనూ వివేక్ కీలకంగా ఉన్నారు. ఈటలను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయొచ్చని వివేక్ భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. తద్వారా గతంలో తనకు ఇచ్చిన హామీ మేరకు పదవి దక్కుతుందని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ ఇదే వ్యతిరేకత...

గతంలోనూ ఇదే వ్యతిరేకత...

ఓవైపు వివేక్ ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలోనే... పెద్దపల్లి లోక్‌సభలో బీజేపీ శ్రేణులు ఆయనపై వ్యతిరేక స్వరం వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన టీఆర్ఎస్‌లో పనిచేసిన సమయంలోనూ పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,శ్రేణులు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. ఈ పరిణామాలే చివరకు ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కకుండా చేశాయి. ఇప్పుడు బీజేపీలోనూ స్థానిక పార్టీ శ్రేణుల నుంచి వివేక్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
There is a heated debate going on in the Telangana BJP over former MP Vivek politics. In particular, BJP leaders in the Peddapalli Lok Sabha segment, which Vivek has represented in the past, have been risinng voice against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X