వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబ్బాక దంగల్: 2 రౌండ్లలో బీజేపీ లీడ్‌..రెండో స్థానంలో టీఆర్ఎస్

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కనిపించారు. ఇక్కడ మొత్తం 23 రౌండ్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్‌ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

 దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ గెలుపు, మరో సర్వే బీజేపీకి పట్టం దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ గెలుపు, మరో సర్వే బీజేపీకి పట్టం

23 రౌండ్లు..

23 రౌండ్లు..

23 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ముగుస్తోందని.. ప్రతీ హాల్ లో 7 టేబుల్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ భారతీ తెలిపారు. అయితే పోస్టల్ బ్యాలెట్‌లో మాత్రం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఈవీఎం ఓట్ల లెక్కించడం ప్రారంభించగా.. బీజేపీ లీడ్‌లో కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 3208 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ సుజాతకు 2867 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి 648 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో బీజేపీ 341 ఓట్ల లీడ్ సాధించింది.

లీడ్‌లో బీజేపీ

లీడ్‌లో బీజేపీ

రెండో రౌండ్‌లో బీజేపీకి 1561 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థికి 1282 ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు 279 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు రౌండ్ల వారీగా చూస్తే బీజేపీకి 4769, టీఆర్ఎస్ 4149, కాంగ్రెస్ 922 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రఘునందన్ రావు 620 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. అయితే మరో 21 రౌండ్లు ఉన్నందున ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది.

Recommended Video

#Dubbakaresult roundup: ముందంజలో బీజేపీ, రెండో స్థానంలో టీఆర్ఎస్
 టికెట్ ఖరారు కాకముందే

టికెట్ ఖరారు కాకముందే

దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే టికెట్ ఖరారు కాక ముందు రఘునందన్ రావు దుబ్బాకలో జోరుగా ప్రచారం చేశారు. ప్రజలనాడీ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీనికితోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుందామని చూశారు. తొలి రెండు రౌండ్లలో ఓటరునాడీ కనిపిస్తోంది.. కానీ అదీ కొనసాగుతుందా.. లేదో చూడాలీ

English summary
bjp candidate raghunandan rao lead in 2 rounds dubbaka by poll counting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X