నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త‌న‌ను ఎదుర్కొన‌డానికి ఒక్క‌టైన బీజేపి, కాంగ్రెస్..! ఆకాశం బ‌ద్ద‌లైనా త‌న‌ను ఓడించ‌లేర‌న్న క‌విత‌..

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్/హైద‌రాబాద్ : త‌న‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. నిజామాబాద్ లో కొన్ని చోట్ల కలిసే తిరుగుతున్నారని మండిప‌డ్డారు.మంగ‌ళ‌వారం బోద‌న్ మండ‌లం అచ‌న్‌ప‌ల్లి లో జ‌రిగిన ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌లో ఆమె ప్ర‌సంగించారు. గత ఎన్నిక‌ల్లో విదేశాల్లో దాచుకున్న న‌ల్ల‌ధ‌నం తెప్పించి 15 ల‌క్ష‌ల రూపాయ‌లు పేదోళ్ల‌ అకౌంట్ల‌లో వేస్తామ‌న్నారు. ఒక్క రూపాయీ వేయ‌లేదని బీజేపి ప్ర‌భుత్వం పై మండిప‌డ్డారు. మ‌ళ్లీ ఈ ఎన్నికల్లోపు 15 వేల రూపాల‌యు ఇస్తామ‌ని చెప్తున్నారు.. డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండి అని కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.

ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి..! కాళేశ్వ‌రానికి జాతీయ హోదా సాదిస్తామ‌న్న క‌విత‌..!!

ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి..! కాళేశ్వ‌రానికి జాతీయ హోదా సాదిస్తామ‌న్న క‌విత‌..!!

గల్లీలోనే కాకుండా ఢిల్లీలో కూడా మన ప్రభుత్వం ఉండాల‌న్నారు క‌విత‌. కాళేశ్వరం కు జాతీయ హోదా ఇవ్వలేదు కానీ పోలవరానికి ఇచ్చి 7 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చారన్నారు. కాళ్లేశ్వ‌రం పూర్త‌యితే బోధన్ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌న్నారు. బోద‌న్ 42 గ్రామాలతో పెద్ద మండలం. పరిపాల సౌలభ్యం కోసం రెండుగా విభజిస్తామ‌ని, ఎన్నికాలయ్యాక రెండు మండ‌లాలు అవుతాయ‌న్నారు. నిజాం సాగర్ చివరి ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు 67 కోట్ల రూపాయ‌ల‌ వ్య‌యంతో కాలువల ఆధునీకరణ చేసుకున్నామ‌న్నారు.

టీఆర్ఎస్ ను ఓడించేందుకు చేతులు క‌లిపిన కాంగ్రెస్, బీజేపి..! మండిప‌డ్డ ఎంపి క‌విత‌..!!

టీఆర్ఎస్ ను ఓడించేందుకు చేతులు క‌లిపిన కాంగ్రెస్, బీజేపి..! మండిప‌డ్డ ఎంపి క‌విత‌..!!

మూత ప‌డిన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఒక‌టొక‌టిగా తెరిపించుకుంటున్నామ‌ని, బోధన్ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని తెరిపించేందుకు ప్ర‌భుత్వం య‌త్నిస్తున్న‌ద‌ని తెలిపారు. రైతులంతా ఒక ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి న‌డుపుకుంటే స‌హ‌కారం అందిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పిన విష‌యాన్ని క‌విత గుర్తు చేశారు. చెర‌కు రైతులు ఇబ్బంది ప‌డుకండా 51 కోట్ల రూపాయ‌ల‌ బ‌కాయిల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు చెల్లించారని, కోర్టు తీర్పు వెలువ‌డ‌గానే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు.

రైతుల‌కు న్యాయం చేస్తాం..! స‌మ‌స్య‌ను కేంద్ర ద్రుష్టిలో ఉంచాన‌న్న క‌విత‌..!!

రైతుల‌కు న్యాయం చేస్తాం..! స‌మ‌స్య‌ను కేంద్ర ద్రుష్టిలో ఉంచాన‌న్న క‌విత‌..!!

హుంసా, కాజాపూర్, మందర్న గ్రామాలకు రుణ మాఫీ లో ఇబ్బంది జరిగిందని, స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేసుకుందామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు కొన‌ని విధంగా కందులు, మినుములు, శనగలను ప్ర‌భుత్వం కొనుగోలు చేసింద‌న్నారు. టిఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతుల‌కు మేలు చేస్తున్న‌ద‌ని, రైతు బంధు 10 వేలు, వెయ్యి పెన్షన్ మే1 నుంచి రెండు వేలు, 57 ఏళ్ల నుంచే పెన్షన్, పి ఎఫ్ కార్డులు ఉన్న వారందరికీ పెన్షన్, పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూంల‌ను క‌ట్టించి ఇస్తామ‌ని క‌విత తెలిపారు.

టీఆర్ అన్ని హామీలు నెర‌వేరుస్తుంద‌న్న క‌విత‌..! ప‌సుపు రైతుల‌కు చేయూత ఇస్తామ‌న్న ఎంపీ..!!

టీఆర్ అన్ని హామీలు నెర‌వేరుస్తుంద‌న్న క‌విత‌..! ప‌సుపు రైతుల‌కు చేయూత ఇస్తామ‌న్న ఎంపీ..!!

ఏ ఆధారం లేని వారికి 50 వేల నుండి 2 లక్షల రూపాయ‌ల‌ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణాలను ఇప్పిస్తుందని క‌విత చెప్పారు.వ్యవసాయ పంట ఉత్పత్తులను డ్వాక్రా సంఘాల చేత కొనుగోలు చేయించి మహిళలకు అదనపు ఆదాయం సమకూర్చబోతున్నామని తెలిపారు. కాశ్మీర్, బంగ్లా సమస్య, సింగరేణి కార్మికులు, పసుపు రైతుల సమస్యలను పార్లమెంట్ లో చర్చకు పెట్టినట్లు చెప్పారు.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha alleged that the Congress and the BJP were fixing the match to defeat her. She said she was going to meet some places in Nizamabad. She spoke at an open public rally in Achankapally in Bodan mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X