వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్ భవన్ వద్ద బీజేపీ నేత లక్ష్మణ్‌కు గాయాలు.. నిమ్స్‌కు తరలింపు.. జెడ్డా పరామర్శ

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ ధర్నా చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఈ ధర్నా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే కార్మీకులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బస్‌భవన్ వద్ద ధర్నాలో పాల్గోన్నారు. ధర్నాలో భాగంగా బస్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో లక్ష్మణ్‌తో పాటు కార్మీక సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంటపాటు ఆందోళన చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు

 కార్మికులతో కలిసి ధర్నా చేపట్టిన బీజేపీ

కార్మికులతో కలిసి ధర్నా చేపట్టిన బీజేపీ

ఇక బస్‌భవన్‌ వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన నేతలు సైతం ధర్నా కొనసాగించారు. దీంతో ఆర్టీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విపక్షాల ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేశారు. ధర్నాలో పాల్గోన్న నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ధర్నా సంధర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.గంటపాటు ఆందోళన సాగిన తర్వాత పోలీసులు జేఏసీ నాయకులతో పాటు ఇతర నేతలను అరెస్ట్ చేశారు

ధర్నాలో పాల్గోన్న లక్ష్మణ్,

ధర్నాలో పాల్గోన్న లక్ష్మణ్,

ఇక ధర్నాలో పాల్గోన్న లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికులకు కనీసం జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంభిస్తుందని ఆయన విమర్శించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని నిర్భంధంలోకి తీసుకుని, భయాందోళనలకు గురి చేస్తుందని ఆయన విమర్శించారు.

 ఆర్టీసీ కార్మికులను తొలగించడం అమానవీయం

ఆర్టీసీ కార్మికులను తొలగించడం అమానవీయం

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటీ ఆర్టీసీ కార్మీకుల త్యాగాలను తుంగలో తొక్కుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఒక్క నిర్ణయంతో 48వేల మంది కార్మీకులను తొలగించామని చెప్పడం లాంటీ దుశ్చర్యలతో కార్మికులపై ఆమానవీయంగా వ్వవహరిస్తుందని విమర్శించారు. సమైక్య పాలకులు కూడ ఇలాంటీ నిర్ణయం తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ ఆస్తిపై కన్నేసిన సీఎం కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాలు, కులాల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

నిమ్స్‌కు తరలింపు

నిమ్స్‌కు తరలింపు

బస్ భవన్ వద్ద జరిగిన తోపులాటలో లక్ష్మణ్ కిందపడిపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఆ తర్వాత ఆయనను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న లక్ష్మణ్‌కు బీజేపీ కార్య నిర్వాహణ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌లో పరామర్శించారు. స్వల్పగాయాలయ్యాని తెలియజేయడంతో పార్టీ వర్గాలు వెంటనే నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మణ్‌కు చికిత్స జరుగుతున్నది.

English summary
Telangana BJP protesting dharna at Bus Bavan in support of the rtc employees strike.and participates bjp state president dr. laxman along with union leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X