వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం పేరుతో బీజేపీ జిమ్మిక్కులు ... విజయశాంతి ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బిజెపి సర్కార్ పై, మోడీ పై మండిపడ్డారు. యుద్ధం పేరుతో బిజెపి చివరి క్షణాలు జిమ్మిక్కులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఫేస్ బుక్ వేదికగా దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.

"ప్రాణాలకు తెగించి శత్రు దేశం తో పోరాడుతున్న సైనికుల త్యాగాన్ని యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు రాజకీయానికి వాడుకోవడాన్ని చూసి, దేశ ప్రజలు ఛీ కొడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై, దేశ ప్రజలను జిఎస్టి పేరుతోనూ, డీమానిటైజేషన్ పేరుతోనూ మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చివరికి దేశ భద్రతను పణంగా పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బిజెపి నీచ రాజకీయాలు చేస్తోంది. రాజకీయాల కంటే దేశ భద్రత ముఖ్యమని భావించడం వల్లే ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్పై తీసుకోబోయే చర్యలకు ఎన్డీఏ సర్కారు కు ఇది మద్దతు తెలిపాయి. కానీ ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లేకపోవడం దురదృష్టకరం."

BJP drafts with the name of war.... Vijayashanti fired

తెలంగాణ రాములమ్మ ఫేస్ బుక్ వేదికగా బిజెపి సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే విజయశాంతి ఈ విధంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.
యడ్డీ చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్త నిరసనలు వ్యక్తం అయ్యాయి. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలను విబేధించారు .

English summary
Telangana Congress Women Leader, Star Campaigner Vijayasanthi fired on the BJP government and Modi. Vijayashanti has criticized the BJP government and Prime Minister Narendra Modi on the controversial comments of Yeddyurappa. 'At one side, the army fights for the nation and the BJP leaders are politicising this serious and sensitive issue for elections 'she posted in fb .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X