• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాలతో ఢీ అంటే ఢీ..! సరైన నాయకత్వం కోసం బీజేపి అన్వేష‌ణ‌..!!

|

అమరావతి/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యుద్దం చేసేందకు బీజేపి పావులు కదుపుతోంది. కేంద్రంలో రెండో సారి అదికారం చేపట్టిన తర్వాత ప్రాంతీయ రాష్ట్రాల లో బలపడేందుకు వినూత్న అడుగులు వేస్తోంది బీజేపి. 2023లో తెలంగాణ బీజేపీదేనంటున్నారు కమలనాథులు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేస్తామంటున్నారు. ఏకంగా అమిత్‌ షానే, టూ స్టేట్స్‌పై నజర్‌ పెట్టారు. బీజేపీ దగ్గర అన్నీ వున్నాయి. సకల శస్త్రాలూ ఉన్నాయి. కానీ కమలానికి కొదువైంది ఒకటుంది ఆ ఇద్దరూ లేకపోతే కమలానికి ఇక్కడ అంత సులభం కాదు. ఇంతకీ బీజేపీకి కొదువైన ఆ ఇద్దరు లీడర్లు ఎవరు.? తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్. అందుకు తగ్గట్టే పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టార్గెట్ తెలంగాణ.

తెలుగు రాష్ట్రాలతో ఇక యుద్దమే..! కొత్త నేతల వేటలో బీజేపి అదిష్టానం..!!

తెలుగు రాష్ట్రాలతో ఇక యుద్దమే..! కొత్త నేతల వేటలో బీజేపి అదిష్టానం..!!

మొన్నటి ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీకి, ఇక్కడ గ్రౌండ్‌ రెడీగా ఉన్నట్టు భావిస్తోంది. కాంగ్రెస్‌ డీలాపడటం, టీడీపీ ఖాళీ కావడం, రెండు పార్టీలకు చెందిన నేతలు కాషాయ కండువా కప్పుకుంటుండటంతో, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దీటైన ప్రత్యర్థిగా బరిలో నిలవాలనుకుంటోంది బీజేపీ. మొన్నటి అమిత్‌ షా టూర్‌ కూడా ఆ దిశలోనే సాగింది. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై, తెలంగాణకు ఆ పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టం చేశారు అమిత్ షా. 2023లో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా, పని చేయాలని రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.

సరైన నాయకుడి కోసం వేట..! పావులు కదుపుతున్న కమలనాథులు..!!

సరైన నాయకుడి కోసం వేట..! పావులు కదుపుతున్న కమలనాథులు..!!

పార్టీ నాయకత్వం తీరు, అమిత్ షా మాటలు చూస్తే టీఆర్ఎస్‌ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ఉంది. ఇక పార్టీలో చేరికలపైనా ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇంకా చాలామంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఇప్పుటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమర సంకేతమిచ్చారు. అటు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చూస్తారన్నారు. 2023లో తెలంగాణలో, బీజేపీ అధికారం సాధించటం ఖాయమని చెప్పారు. అయితే కాషాయ పార్టీ ఆశలు, అంచనాలు, వ్యూహాలు పకడ్బందీగా ఉన్నా, అసలు సమస్య మాత్రం వేరే ఉంది.

తెలంగాణ ఊపు తెచ్చిన అమీత్ షా పర్యటన..! పుంజుకున్నామంటున్న నేతలు..!!

తెలంగాణ ఊపు తెచ్చిన అమీత్ షా పర్యటన..! పుంజుకున్నామంటున్న నేతలు..!!

అదే ముఖ్యమంత్రి అనదగ్గ దీటైన నాయకులు, రెండు రాష్ట్రాల్లోనూ బూతద్దం పెట్టి వెతికినా కానరావడం లేదు. ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలో లేని నాయకులను మినహాయిస్తే ఎవరూ పార్టీలో చేరలేదు. అసలు ఇప్పుడు బీజేపీకి కావాల్సింది కొత్త నాయకత్వాన్ని తయారు చెయ్యడం మాత్రమే కాదు, ధీటైన నాయకత్వాన్ని జనానికి చూపించగలగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రశేఖర్ రావు , జగన్, చంద్రబాబులతో సమానమైన ఫేసు బీజేపీకి లేదన్న చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాదిలాగా ఓన్లీ మోడీ ముఖం చూసే ఓట్లు వేయరని, స్థానికంగా సీఎం అభ్యర్ధి ఎవరన్న విషయాన్ని కచ్చితంగా పట్టించుకుంటారని విశ్లేషకుల అభిప్రాయం. అదే ఇప్పుడు బీజేపీకి లోపించింది. సో..ఇప్పుడు పార్టీకి చరిష్మా ఉన్న నాయకుడు ఒకరు కావలెను అన్న చర్చ జరుగుతోంది.

కాపు నేత కోసం గాలం..! ఆంద్రలో బీజేపి వినూత్న రాజకీయం..!!

కాపు నేత కోసం గాలం..! ఆంద్రలో బీజేపి వినూత్న రాజకీయం..!!

ఒక ప్రముఖ పార్టీకి చెందిన నాయకుడు పార్టీతో టచ్‌లో ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపించాయి. అమిత్ షా టూర్లోనే అతడు పార్టీలో చేరటం ఖాయం అన్నారు. కానీ ఎందుకనో జరగలేదు. ఒకరిద్దరు పెద్దగా ప్రాచుర్యంలోలేని వారు మాత్రమే పార్టీలో చేరారు. అయితే, రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటమే కాదు, పార్టీలో చరిష్మా ఉన్న నాయకుడి అవసరం అంతకంటే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడే 2023లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఉన్నవాళ్లను తయారు చేస్తారా లేదంటే రెడీమేడ్‌గా అవతలి పార్టీలోని పవర్‌ఫుల్‌ లీడర్‌ను లాగేస్తారా అన్నది చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP is moving its feet to a political war in the Telugu states. The BJP is taking innovative steps to strengthen regional provinces after taking a second term at the Center. BJP leaders planning to come in to power Telangana in 2023, as well as in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more