వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా రైతన్నకు బాసటగా బీజేపీ దీక్ష .. అన్ని పంటలు ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని డిమాండ్

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా ఉందని , రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉపవాస దీక్షలు చేపట్టారు . రైతు సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని, రైతన్నలను ఆదుకోవటానికి ప్రభుత్వం నడుం బిగించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు , అలాగే రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వంలో చలనం తీసుకురావటానికి దీక్ష చేపట్టామని ఆయన పేర్కొన్నారు .

 రైతులను ఆదుకోవాలని ఒకరోజు దీక్ష చేస్తున్న బీజేపీ

రైతులను ఆదుకోవాలని ఒకరోజు దీక్ష చేస్తున్న బీజేపీ

పంటకొనుగోళ్లు లేకపోవడంతోనే రైతులు ఆందోళనకు దిగారని పేర్కొన్న తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు . మొన్నటికి మొన్న కరీంనగర్ లో పంట కొనుగోలు చెయ్యక అకాల వర్షంతో తడిసిందని , ఇక అలాంటి పంటను సైతం ప్రభుత్వం తక్షణం కొనుగోలు చెయ్యాలని రైతులు ఆందోళన చెయ్యటంలో న్యాయం ఉందని చెప్పారు. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ తో రైతులు వారి ధాన్యం ,అలాగే ఉద్యానపంటలైన మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ వంటి వాటిని , అలాగే కూరగాయలను అమ్ముకునే పరిస్థితి లేదు .

కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్


ప్రభుత్వం కరోనా సాకుతో రైతులను పట్టించుకోవటం లేదని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దీక్షలో పాల్గొంటున్న బీజేపీ నేతలు అంటున్నారు . ఇక రైతుల కోసం దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు . క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటామనే స్థాయికి వచ్చారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించకుండా తిరిగి వారిపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు.

Recommended Video

Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference
 రైతన్నకు అండగా బీజేపీ .. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉపవాస దీక్షలు

రైతన్నకు అండగా బీజేపీ .. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉపవాస దీక్షలు

రైతులకు అండగా బీజేపీ ఉంటుందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. రైతులకు సంఘీభావంగా ఇవాళ ఉపవాసదీక్ష చేపట్టినట్లు బండి సంజయ్ చెప్పారు. ఇక ఇదే సమయంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం అయ్యిందని బండి సంజయ్ విమర్శించారు . సీఎం కేసీఆర్ కు దమ్ముంటే పాత బస్తీలో లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీజేపీ నేతలు నేడు ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. రైతుల విషయంలో ప్రభుత్వ ధోరణి మార్చుకోవాలని అన్ని పంటలు కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు .

English summary
Under the BJP-led state-wide hunger strike, the government has called on the farmers to take over the corona lockdown effect on farmers. Telangana BJP president and MP Bandi Sanjay demanded an all-party meeting to solve the farmers' problems and the government should tighten up to help the farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X