• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా బీజేపీ ... అందుకేనా కేటీఆర్ విసుర్లు

|
  కేటీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్న తెలంగాణా నేతలు || BJP Leaders Are Creating Tension In KTR And KCR

  రానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కి చెక్ పెట్టే వ్యూహంలో ఉంది . అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందేమో అన్న సందేహాలు గులాబీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. ఇక బీజేపీ జాతీయ నాయకులు రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేసే కసరత్తు చేస్తున్నారు . ఇక టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంత సీన్ లేదు . నాలుగు సీట్లు వస్తే అయిపోయిందా .. ఈ మాత్రం దానికే ఎగిరెగిరి పడుతున్నారు అని రోజుకో రకమైన విమర్శ చేస్తున్నారు.

  నిన్నటిదాకా టీఆర్ఎస్ ఆపరేషన్ .. ఇప్పుడు బీజేపీ ఆపరేషన్

  నిన్నటిదాకా టీఆర్ఎస్ ఆపరేషన్ .. ఇప్పుడు బీజేపీ ఆపరేషన్

  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్నారు తెలంగాణా బీజేపీ నేతలు . నిన్నటి వరకు టీఆర్ ఎస్ ఆడిన గేమ్ కు రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించి ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే ఇక తాజాగా బీజేపీ కూడా గులాబీ పార్టీ బాటలో ఆపరేషన్ ఆకర్ష అంటుంది. అందులో భాగంగా

  తెలంగాణాలోని టీడీపీలో ఉన్న ముఖ్యులను, కాంగ్రెస్ లోని కీలక నేతలను, టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుంది. తెలంగాణా విమోచనా దినోత్సవం సందర్భంగా అమిత్ షా తెలంగాణా రాక సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ కొరకరాని కొయ్యగా తయారవుతుంది.

  బీజేపీతో గులాబీ పార్టీకి చిక్కులు .. కక్కలేని మింగలేని పరిస్థితిలో టీఆర్ఎస్

  బీజేపీతో గులాబీ పార్టీకి చిక్కులు .. కక్కలేని మింగలేని పరిస్థితిలో టీఆర్ఎస్

  ఇక తాజాగా లోక్‌సభలో ఆర్టికల్ 370రద్దు విషయంలో టీఆర్ఎస్ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. అది గులాబీ పార్టీకి ఇష్టం లేకున్నా రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుని బీజేపీ సర్కార్ తెస్సుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. ఒక పక్క మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించినా సరే టీఆర్ ఎస్ కు బీజేపీని సమర్ధించక తప్పలేదు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని దూకుడు మీదున్న పార్టీకి మద్దతు ఇవ్వటం కూడా అడకత్తెరలో పోక చెక్కలా గులాబీ పార్టీ నలిగిపోయిన పరిస్థితి. ఇక తాజాగా కేటీఆర్ తెలంగాణ వికాస సమితి మహాసభల ప్రారంభోత్సవంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి .

  బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

  బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

  బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. 'కొందరు తమతో ఉంటే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు‘ అనేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సాద్వి ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. గాంధీని చంపిన వాళ్లను దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్ ను కొందరు సమర్థించడం తనకు ఆందోళన కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు . మతం అన్నది పూర్తిగా వ్యక్తిగతమని చెప్పిన కేటీఆర్ దాన్ని వేరే అంశాలతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతే కాదు దేశంలో మతోన్మాదం పెరిగితే భవిష్యత్ తరాలకు ముప్పుతప్పదని ఆయన హెచ్చరించారు .

  భవిష్యత్ టెన్షన్ తోనే బీజేపీని టార్గెట్ చేస్తున్న కేటీఆర్

  భవిష్యత్ టెన్షన్ తోనే బీజేపీని టార్గెట్ చేస్తున్న కేటీఆర్

  కేసీఆర్ ను శభాష్ అంటే తెలంగాణా వాళ్ళు, కేసీఆర్ చేసింది తప్పని ఎత్తి చూపితే ఆంధ్రా వాళ్ళు అని గులాబీ పార్టీ కూడా అదే దారిలో ఉంది. అయితే టీఆర్ఎస్ దీ అదే విధానమని, తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఇలాగే ప్రవర్తించింది అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తే తప్పు లేదు పక్కనోళ్ళు చేస్తే తప్పు అన్న విధానం గులాబీ నేతలదని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ తెలంగాణలో ఎక్కడ బలపడుతుందో అన్న భయమే అనుక్షణం ఏదో ఒక విషయంలో బీజేపీ నేతలను కేటీఆర్ టార్గెట్ చేసేలా చేస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి జాతీయ నాయకులు రంగంలోకి దిగటంతో తెలంగాణలో బీజేపీ దూకుడుకు అడ్డు కట్ట వెయ్యలేక కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

  English summary
  Telangana BJP leaders are creating tension in TRS Working President KTR and CM KCR. The game was played by TRS until yesterday, and the reverse game was started now bjp . Until yesterday, the TRS party invites the leaders of the opposition parties and encourages defection. but now bjp is doing the same . This is being headache to the KTR and he criticising bjp when ever he got chance to criticise .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X