హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కుటుంబ పాలనపై కేంద్రమంత్రి, మూడేళ్ల ముందే బీజేపీ ప్లాన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజాస్వామ్యం బలపడుతోందని, కానీ 41 సంవత్సరాల క్రితం నాటి ఎమర్జెన్సీ సందర్భాన్ని, ఆ తర్వాత దాపురించిన పరిస్థితులను ఎప్పటికి మరిచిపోలేమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఢిల్లీలో అయినా, తెలంగాణలో అయినా కుటుంబ పాలనను ప్రజలు సహించరన్నారు.

ఎమర్జెన్సీ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో, అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధించారో ఇప్పటి తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబ పాలనను ప్రజలు ఎక్కువ రోజులు సహించరని చెప్పారు.

రాష్ట్రాలు నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కేంద్ర పథకాలను సరిగా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను ఏపీ, తెలంగాణలకు ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామని రిజిజు చెప్పారు. ఆయన హైదరాబాదులో మాట్లాడారు.

కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ రాష్ట్రాల్లో కేంద్ర పథకాల అమలు సంతృప్తికరమన స్థాయిలో లేదన్నారు.

కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు

కేంద్ర ప్రభుత్వం పేదల అభివృద్ధే లక్ష్యంగా పథకాలను రూపొందించి అమలు చేస్తోందని కిరణ్ రిజిజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ పని కావాలన్నా దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉండేదన్నారు.

కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు

తమ ప్రభుత్వం పారదర్శక పాలనకు పెద్ద పీట వేసిందన్నారు. ఎవరూ దళారులను ఆస్రయించాల్సిన పని లేకుండా చేశామని చెప్పారు.

కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు

కేంద్ర పథకాల అమలు తీరును గమనించినప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆయా పథకాలను అందిపుచ్చుకొని పురోగతి సాధిస్తున్నాయని, బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం పథకాలను సరిగా అమలు చేయడం లేదన్నారు.

కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసేది అంతా ప్రజల సొమ్మేనని, ఏదైనా పథకం అందకపోతే ప్రభుత్వాలని నిలదీయాలని కిరణ్ రిజిజు సూచించారు. నిధులు ప్రజలకు అందటం లేదన్నారు.

కిరణ్ రిజిజు

కిరణ్ రిజిజు

తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. కాశ్మీరులో జరిగిన ఉగ్రవాద దాడి దురదృష్టకరమని, దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు.

తెరాసకు ధీటుగా

తెరాసకు ధీటుగా

కాగా, తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలను కాదని తెరాసకు ధీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం టి అద్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు అవకాశమివ్వకుండా తామే తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కమలం పార్టీ భావిస్తోంది.

తెరాసకు ధీటుగా

తెరాసకు ధీటుగా

ఇందులో భాగంగా డాక్టర్ కె లక్ష్మణ్ జిల్లాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయనున్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు పార్టీని తీసుకు వెళ్లనున్నరు. పార్టీని తెరాసకు ప్రత్యామ్నాయంగా చేసేందుకు అసెంబ్లీ ఇంచార్జులను ప్రకటించనున్నారు. మూడేళ్ల ముందే ఇంఛార్జులను ప్రకటించనున్నారు. తద్వారా, వారు నియోజకవర్గంలో తిరిగేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందనేది బీజేపీ ప్లాన్.

English summary
The TS BJP has taken a decision against having any truck with the TRS in an attempt to emerge as the political alternative in the state, with the fortunes of the Congress and the TD dwindling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X