హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పరిపూర్ణానందస్వామి బహిష్కరణ కుట్ర': స్వామి న్యాయపోరాటం, పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పరిపూర్ణానంద స్వామిని కాకినాడ తరలింపు

హైదరాబాద్/కాకినాడ: శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామిని పోలీసులు నగరం నుంచి బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కే లక్ష్మణ్ బుధవారం మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.

మహేష్ కత్తి ఖేల్ ఖతమ్! హైదరాబాద్ వచ్చినా, పోస్ట్ పెట్టినా జైలుకే, టీవీ ఛానల్‌కు డీజీపీ షాక్మహేష్ కత్తి ఖేల్ ఖతమ్! హైదరాబాద్ వచ్చినా, పోస్ట్ పెట్టినా జైలుకే, టీవీ ఛానల్‌కు డీజీపీ షాక్

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణపై పోలీసులు పునరాలోచన చేయాలన్నారు. కోట్లాది మంది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ నేతలపై చర్యలు ఏవని ప్రశ్నించారు. పరిపూర్ణానంద స్వామిపై పెట్టిన కేసును ఎత్తివేయాలన్నారు.

BJP Laxman fires at KCR government for ban on Paripoornananda Swami

కాకినాడకు తరలింపు

పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి కాకినాడకు తరలిస్తున్నారు. తాను భద్రాచల శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటానని ఆయన పోలీసులను కోరారు. దానికి వారు అంగీకరించారని తెలుస్తోంది. మధ్యలో అనుష్టానం చేసుకునేందుకు అనుమతించారు. మధ్యమధ్యలో దేవాలయాల సందర్శనకు కూడా అనుమతించారని తెలుస్తోంది. పరిపూర్ణానంద స్వామి రాత్రికి భద్రాచలంలో బస చేస్తారా లేక దర్శనం అనంతరం కాకినాడకు తరలిస్తారా తెలియాల్సి ఉంది.

పరిపూర్ణానంద స్వామి బహిష్కరణ: ప్రభుత్వంపై ఆగ్రహం

పరిపూర్ణానంద స్వామిని నగరం నుంచి బహిష్కరించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. సిద్దిపేట‌లో బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైకోర్టులో పిటిషన్

పోలీసుల తీరుపై పరిపూర్ణానంద స్వామి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి, పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా అదేశాలివ్వాలని కోరారు. అయితే, ఆ పిటిషన్‌ను లంచ్ మోషన్ కింద స్వీకరించలేమని హైకోర్టు చెప్పింది. దీనిపై కోర్టు రేపు లేద ఎల్లుండి విచారణ జరిపే అవకాశముంది.

English summary
Telangana BJP chief Laxman fired at K Chandrasekhar Rao government for ban on Paripoornananda Swami from Hyderabad city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X