• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రామా అన్న పదం కూడా బూతుగా? -అసదుద్దీన్ ఓవైసీ కంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ క్రిమినలా?: విజయశాంతి

|

బీజేపీ ఏలుబడిలో మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలు అభద్రతా భావంలో కూరుకుపోయారన్న వాదన అవాస్తమని, దేశంలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదని, అలా ఉన్నట్ట్టు ముస్లిలెవరూ భయపడరాదంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్లపై లోతైన చర్చ కొనసాగుతున్నది. ఎన్నడూ లేనిది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని దేశ నాయకుడిగా కీర్తించడమూ చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే సంఘ్ పరివార్ కొత్త ఎత్తులు వేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో భగవత్ పై ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు..

షాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలుషాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలు

  Women's Day 2021: GHMC Women Sanitary workers Felicitated by BJP Mahila morcha
  ఓవైసీ ఏమన్నారంటే..

  ఓవైసీ ఏమన్నారంటే..

  ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో మొన్న ఆదివారం ‘హిందుస్తానీ ఫస్ట్..హిందుస్తాన్ ఫస్ట్' అనే అంశంపై జరిగిన సదస్సులో మోహన్ భగవత్ మాట్లాడుతూ, ఇండియాలో ఇస్లాం ప్రమాదంలో పడలేదని, మతం పేరిట, గోవు పేరిట జరిగే మూకదాడులను హిందూత్వ ప్రోత్సహించబోదని, అసలు మతాలకు అతీతంగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని భగవత్ అన్నారు. ఈ వ్యాఖ్యలను గర్హించిన ఓవైసీ.. ముస్లింలపై ద్వేషంతోనే హిందూత్వ సిద్ధాంతం పుట్టుకొచ్చిందని, ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న క్రిమినల్స్‌కు ప్రభుత్వం మద్ధతు ఉందని ఆరోపించారు. గోరక్షకుల చేతిలో హతమైన ముస్లింల పేర్లను సైతం ఓవైసీ ట్వీట్ చేశారు. కాగా,

  రామా అన్నా బూతు లాగేనా?

  రామా అన్నా బూతు లాగేనా?

  మోహన్ భగవత్ సందేశంపై అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లను బీజేపీ నేత విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో.. ‘‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే... రామ అన్న పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోంది.

  మజ్లిస్ తీరు విడ్డూరం..

  మజ్లిస్ తీరు విడ్డూరం..

  దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు... ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం.

  క్రిమినల్ కళ్లకు అన్నీ అలాగే..

  క్రిమినల్ కళ్లకు అన్నీ అలాగే..

  మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారని... ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అసదుద్దీన్ గారి దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ గారికి.. భగవత్ గారి అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుంది. అయితే..

  అసద్.. నీ తమ్ముడు క్రిమినల్ కాడా?

  అసద్.. నీ తమ్ముడు క్రిమినల్ కాడా?

  భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది'' అని విజయశాంతి ప్రశ్నించారు.

  జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్

  English summary
  actor turned politician vijayashanthi slams hyderabad mp, aimim chief asaduddin owaisi for criticising rss chief mohan bhagwat's speech over muslims conditions in india. vijayashanti blames owaisi taht he did not understand the united spirit delivered by bhagavath.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X