• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

|

ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆకాశమే హద్దులా టీఆర్ఎస్ వైఫల్యాలు కొనసాగుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతిపాలైందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆమె తన అధికారిక ఖాతాలో సుదీర్ఘ ప్రకటన చేశారు..

జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?

 పంటలకు నిప్పులు..

పంటలకు నిప్పులు..

‘‘తెలంగాణ సర్కారు అస్తవ్యస్త పరిపాలనా తీరు దేశవ్యాప్తంగా చులకన చేసే స్థితికి దిగజారిపోయింది. సీఎం కేసీఆర్ దొరగారు ఉద్యమకాలంలోను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్లే తప్ప చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తేలిపోయింది. కేసీఆర్ దొరవారి హామీతో సన్న వడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కని పరిస్థితుల్లో ఆ రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చింది. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్ళు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారు, అన్నదాతలు తమ పంటలకు మంట పెట్టుకున్నారు..

నిరుద్యోగుల బలవన్మరణాలు..

నిరుద్యోగుల బలవన్మరణాలు..

మీరిచ్చిన ఉద్యోగాల హామీని నమ్ముకున్న పలువులు అమాయక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వివిధ ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో సైతం కేసీఆర్ సర్కారు విఫలమైంది. మొత్తంగా చూస్తే, అటు ఉద్యమ కాలంతో పాటు పాలనా పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కేసీఆర్ చెబుతూ వచ్చిన "మా నీళ్ళు మాకు... మా ఉద్యోగాలు మాకు" అనే నినాదం, ఆయన అధికారానికి వచ్చినా సాకారం కాని దారుణ పరిస్థితిలో రాష్ట్రం ఉంది.

దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా..

దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా..

ఇక భూసంస్కరణలంటూ కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోంది. ఇవిగాక డబుల్ బెడ్రూములు, దళితులకు మూడెకరాలు, తాజాగా వరదసాయం, మీ నేతల కబ్జాలు, అవినీతి... ఇలా చెప్పుకుంటూ పోతే టీఆరెస్ వైఫల్యాల వరుసక్రమానికి ఆకాశమే హద్దు. మీరిచ్చే హామీలన్నీ ఓట్ల కోసం వేసే గాలాలేనని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మీరు వారి మధ్యకెళ్ళినప్పుడల్లా దుబ్బాక, జీహెచ్ఎంసీలను గుర్తు చేస్తూనే ఉంటారు'' అని విజయశాంతి పేర్కొన్నారు.

మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకమగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

English summary
telangana bjp leader vijayashanthi slams cm kcr and trs govt over dharani portal, unemloyment and other key issues. vijayashanthi allegges that chaotic administration of kcr has deteriorated to telangana of disarray across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X