హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిపూర్ణానంద బహిష్కరణ: బీజేపీ ‘చలో ప్రగతిభవన్’ భగ్నం, ఎక్కడికక్కడ అరెస్టులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఛలో ప్రగతిభవన్‌ను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయనను రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

bjp leaders arrested by hyderabad police

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బాద్దం బాల్ రెడ్డిని అసెంబ్లీ వద్ద అరెస్త్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

bjp leaders arrested by hyderabad police

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతిగతిభవన్‌కు బయలుదేరిన ఎమ్మెల్సీ రామచందర్ రావును తార్నాకలోని ఇంటివద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

bjp leaders arrested by hyderabad police
English summary
BJP Leaders arrested by hyderabad police, when they going to Telangana CM KCR residence Pragathi Bhavan on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X