వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాడనే అశోక్ బాబు రాజీనామా చేస్తానని అంటున్నాడు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి/బెంగళూరు: గవర్నర్ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు చేసినప్రచారంపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌కు వినతిపత్రం అందించారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభోట్ల మాట్లాడారు. ఓ ఎన్జీవో అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేయడమంటే సర్వీస్ రూల్స్ అతిక్రమించినట్లే అన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే అశోక్ బాబు బీజేపీని విమర్శిస్తున్నారన్నారు.

BJP leaders lodges plaint against Andhra Pradesh officers

తనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాడనే నమ్మకంతోనే అశోక్ బాబు రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నారని చెప్పారు. అశోక్ బాబు తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరవచ్చునని చెప్పారు.

మరోవైపు, అశోక్ బాబుపై కర్నాటక బీజేపీ నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు. అశోక్ బాబుతో పాటు మరో ఎనిమిది మంది ఎన్జీవో నేతలపై ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అనంతరం బీజేపీ నేత శోభ కందర్లాజే మాట్లాడుతూ.. అశోక్ బాబు మరికొందరు ఉద్యోగులు మే 6వ తేదీన తెలుగు ఓటర్లను కూడగట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారని చెప్పారు.

English summary
BJP lodged a complaint with Andhra Pradesh Governor, the Chief Election Commission and the Chief Electoral Officer of Karnataka urging to take suitable legal action against sponsored AP Non-Gazetted Officers’ Employees’ Association president P. Ashok Babu and eight others for instigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X