• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం ... టీఆర్ఎస్ లో చేరతా కానీ కండిషన్స్ అప్లై

|
  బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం!! || Oneindia Telugu

  తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి .శ్రీరామనవమి సందర్భంగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు అటు బీజేపీ నేతలకు, ఇటు రాజకీయవర్గాలకు షాకింగ్ అనిపించాయి.

  వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్

  టీఆర్ఎస్ లో చేరతా కానీ షరతులు వర్తిస్తాయంటున్న రాజాసింగ్

  టీఆర్ఎస్ లో చేరతా కానీ షరతులు వర్తిస్తాయంటున్న రాజాసింగ్

  ఆదివారం హైదరాబాద్‌‌లో శ్రీరామ శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వద్ద జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు . ఇక ఆ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .సీఎం కేసీఆర్‌కు తాను ఒక ఆఫర్ ఇస్తున్నా.. తాను టీఆర్ఎస్‌లోకి చేరడానికి సిద్ధం.. అయితే అందుకు ఒక షరతు ... అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం, గోవులను రక్షించేందుకు, మతమార్పిడులకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమంలో మీరు కలిసి వస్తారా అని ప్రశ్నించారు.ఒకవేళ తన షరతులను ఒప్పుకుంటే టీఆర్ఎస్ లో చేరతానని బహిరంగంగానే ప్రకటించారు.

  శ్రీరామ శోభాయాత్ర సభలో షాకింగ్ విషయాలు మాట్లాడిన రాజా సింగ్

  శ్రీరామ శోభాయాత్ర సభలో షాకింగ్ విషయాలు మాట్లాడిన రాజా సింగ్

  నేడు దేశంలో జై శ్రీరామ్ అనడం కూడా మతపరమైనదిగా మారిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఒక్క 20 నిమిషాల సమయం తమకు ఇస్తే చాలు దేశంలో ఉన్న దేశ ద్రోహులను తరిమి కొడతామన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అఖండ హిందూ రాష్ట్ర స్థాపనకు ప్రతి హిందువు నడుం బిగించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత కాశీ, మధురలోనూ మందిరాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారత్ మాతాకీ జై... వందేమాతరం అనడానికి సిగ్గుపడే వారికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. చాలా ఆవేశంగా మాట్లాడిన రాజాసింగ్ టీఆర్ఎస్ కు ఇచ్చిన ఆఫర్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.

  తన ఆఫర్ తో కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టిన రాజా సింగ్

  తన ఆఫర్ తో కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టిన రాజా సింగ్

  ఒకవేళ కేసీఆర్ కు ఉన్న ఆధ్యాత్మికత నేపధ్యంలో రాజా సింగ్ కండిషన్స్ కు ఓకే అంటే మిత్రపక్షంతో తంటా వచ్చి పడుతుంది . మజ్లీస్ పార్టీకి చాలా ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ కేవలం ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కోసం మజ్లీస్ తో పేచీ పెట్టుకుంటారా ? చెప్పండి . ఇక మద్దతు ఇవ్వకుంటే హిందూ వ్యతిరేకిగా రాజా సింగ్ ప్రచారం చేసే అవకాశం సైతం లేకపోలేదు . ఏది ఏమైనా తన ఆఫర్ తో రాజా సింగ్ కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టారు.

  English summary
  Raja Singh participated in the public rally after the Srirama Sobhayatra in Hyderabad on Sunday. He made sensational comments in the meeting. He is making an offer to CM KCR .. He is prepared to join the TRS .. But one condition is that ... if you come together in the movement they are going to do against Ramamandiram for the construction of Rama Mandir in Ayodhya, It was publicly announced that, then he will join in TRS .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more