నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాజాసింగ్,ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందు జాగ్రత్తగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... ఇటీవల ఎమ్మెల్యేను కలిసినవారు,ఆయనతో సన్నిహితంగా మెలిగినవారిలోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే,ఆయన కుటుంబం హోమ్ క్వారెంటైన్‌లో ఉంది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించిన రాజాసింగ్.. కరోనాను జయించేందుకు ప్రతీ ఒక్కరూ వ్యాయామం,యోగ చేస్తూ ఫిట్‌గా ఉండాలని సూచించారు.

పోలీస్ శాఖలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కరోనా.!భయభ్రాంతులకు గురవుతున్న యంత్రాంగం.!పోలీస్ శాఖలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కరోనా.!భయభ్రాంతులకు గురవుతున్న యంత్రాంగం.!

తెలంగాణలో ప్రజాప్రతినిధులు,వారి డ్రైవర్లు,గన్‌మెన్లకు కరోనా సోకుతున్న కేసులు పెరుగుతున్నాయి. మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారినపడగా.. ఆ తర్వాత ఆయన సతీమణి పద్మలతా రెడ్డి,గన్‌మెన్,డ్రైవర్,వంట మనిషికి కూడా పాజిటివ్‌గా తేలింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా సోకగా... ఆయన సతీమణి,డ్రైవర్,గన్‌మెన్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి,బాజిరెడ్డి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 bjp mla rajasingh gunman tested coronavirus positive

మరోవైపు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శుక్రవారం(జూన్ 19) ఒక్క రోజే 499 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మృతి చెందారు.తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,525కి చేరింది. కరోనాతో ఇప్పటివరకూ మొత్తం 198 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం నమోదైన కేసుల్లోనూ అత్యధికంగా 329 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో జీహెచ్‌ఎంసీలో కేసుల సంఖ్య 4526కి చేరింది. దీంతో గ్రేటర్ వాసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది.

English summary
The gunman of BJP MLA Raja Singh from Goshamahal assembly constituency tested positive for coronavirus on Friday. The gunman, Balaram, is said to have been suffering from suspected coronavirus symptoms and found to be infected with the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X