హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దత్తన్న కొడుకు మృతదేహాన్ని చూసి నాయిని కన్నీరుమున్నీరు: పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అశ్రునయనాలతో బండారు వైష్ణవ్ అంత్యక్రియలు

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌కు పెళ్లి కాలేదు. దీంతో అతనికి తమ సంప్రదాయం ప్రకారం జిల్లేడు చెట్టుతో వివాహం జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఒగ్గు కళాకారులు మల్లన్న పటాలను వేశారు. దత్తాత్రేయ సోదరుడు రాజశౌరి కుమారుడు శివశంకర్ ఇంగ్లీకం పట్టుకొని ముందుకు సాగారు. అతని వెంట దత్తాత్రేయ ఉన్నారు. వైష్ణవ్ అంత్యక్రియలు బుధవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే.

కొడుకు మృతి విషయం ఉదయం దాకా దత్తన్నకు తెలియదు! ఆ బాధ నాకు తెలుసు: నందమూరి హరికృష్ణ కొడుకు మృతి విషయం ఉదయం దాకా దత్తన్నకు తెలియదు! ఆ బాధ నాకు తెలుసు: నందమూరి హరికృష్ణ

దత్తాత్రేయ ఇంటి నుంచి రాంనగర్ గుండూ, అడిక్‌మెట్, విద్యానగర్, నల్లకుంట, కాచిగూడ మీదుగా స్మశాన వాటికకు తరలించారు. అంతకుముందు, వైష్ణవ్ మృతదేహాన్ని చూసి టీఆర్ఎస్ నేత, మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సహా తట్టుకోలేకపోయారు. 21 ఏళ్లకే కన్నుమూయడంతో తీవ్ర ఆవేదనతో నాయిని వెక్కి వెక్కి ఏడ్చారు.

కాలేజీలో వైష్ణవ్ ఎలా ఉండేవాడంటే!: దత్తాత్రేయ కుమారుడి మృతిపై శ్రీచైతన్య ప్రిన్సిపాల్కాలేజీలో వైష్ణవ్ ఎలా ఉండేవాడంటే!: దత్తాత్రేయ కుమారుడి మృతిపై శ్రీచైతన్య ప్రిన్సిపాల్

తండ్రి, లక్ష్మణ్ గెలుపు కోసం ప్రచారం చేసిన వైష్ణవ్

తండ్రి, లక్ష్మణ్ గెలుపు కోసం ప్రచారం చేసిన వైష్ణవ్

వైష్ణవ్ 2014లో బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో తండ్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే కే లక్ష్మణ్ తరఫున కార్యకర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొంటారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలతో అందరితో కలిసిపోయేవారు.

మంచి భోజన ప్రియుడు

మంచి భోజన ప్రియుడు

వైష్ణవ్ మంచి భోజన ప్రియుడు అని తెలుస్తోంది. బర్గర్, పిజ్జాలు ఎక్కువగా ఇష్టపడతాడట. వైష్ణవ్ లో ప్రొపైల్‌కు ప్రాధాన్యత ఇచ్చేవాడు. తండ్రి కేంద్రమంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్న సాధారణంగా ఉండేవాడు. తండ్రి పదవిలో ఉన్నాడనే గర్వం మచ్చుకైనా అతనిలో కనిపించేది కాదని అంటున్నారు. అతను చదివే కాలేజీ యాజమాన్యం కూడా ఇదే విషయం చెప్పింది.

పుట్టెడు దుఃఖంలో దత్తాత్రేయ

పుట్టెడు దుఃఖంలో దత్తాత్రేయ

దత్తాత్రేయకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు వైష్ణవ్‌ ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొడుకును కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న దత్తాత్రేయను గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శించారు. వైష్ణవ్‌ భౌతికకాయానికి నివాళులర్పించి ధైర్యంగా ఉండాలంటూ దత్తాత్రేయ కుటుంబాన్ని ఓదార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్‌, కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్‌, సంతోష్‌ గంగ్వార్‌, రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహబూద్‌ అలీ, కేవీపీ రామచంద్ర రావు తలసాని శ్రీనివాస్ యాదవ్, దత్తాత్రేయ నివాసానికి చేరుకుని ఆయన్ను పరామర్శించారు. వైష్ణవ్‌ మృతదేహానికి నివాళులర్పించారు.

ఏడుపు ఆపుకోలేకపోయిన నాయిని

ఏడుపు ఆపుకోలేకపోయిన నాయిని

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తాత్రేయ కుమారుడి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దత్రాత్రేయను పరామర్శించిన వారిలో ఎంపీలు, శాసనసభ్యులు, ఎంఎల్‌సీలు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులున్నారు. నాయిని నర్సింహా రెడ్డి అయితే ఏడుపు ఆపుకోలేకపోయారు.

English summary
Former union minister and BJP MP Bandaru Dattatreya's son Vaishnav Funeral completed on Wednesday. Vaishnav was a third year medical student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X