India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download
LIVE

పరేడ్ గ్రౌండ్‌లో లక్షలాదిగా జనం: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ ప్రధాని మోడీ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో శనివారం ప్రారంభం అయ్యాయి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశాలను ప్రారంభించారు. ఇందులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. రెండోరోజు బీజేపీ జాతీయ కార్యవర్గంలో పలు కీలక తీర్మానాలు ఆమోదం పొందనున్నాయి.

వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి నిర్వహించే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఈ సారి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దీనికి అనుగుణంగానే తీర్మానాలు కూడా ఉండబోతోన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సాయంత్రం సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే విజయసంకల్ప్ దివాస్ బహిరంగసభపై అందరి దృష్టీ నిలిచింది. మోడీ, జేపీ నడ్డా, జీ కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు ఇందులో పాల్గొననున్నారు.

ఈ భేటీకి సంబంధించిన వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం..

 BJP National Executive meeting at Hyderabad live details are here

Newest First Oldest First
8:13 PM, 3 Jul
ప్రసంగం ముగించిన అనంతరం ప్రధాని మోడీ రాజ్‌భవన్‌కు వెళ్లారు.
8:12 PM, 3 Jul
కాగా, మోడీ తన ప్రసంగంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కాకతీయుల ధైర్యసాహసాలను ప్రస్తావించారు. మోడీ ప్రసంగిస్తున్నంత సేపు మోడీ మోడీ అంటూ నినాదాలు హోరెత్తాయి.
8:12 PM, 3 Jul
కాగా, టీఆర్ఎస్ రాజకీయ విమర్శలు, కేసీఆర్, టీఆర్ఎస్ గురించి తన ప్రసంగంలో ప్రస్తావన కూడా చేయలేదు ప్రధాని మోడీ. అయితే, తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ఆయన వివరించారు. తెలంగాణలోని ప్రతి మూలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వెళ్లాయన్నారు.
8:11 PM, 3 Jul
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని, అభివృద్ధి మరింత వేగం ఖావడం కూడా ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
8:11 PM, 3 Jul
తెలంగాణలో 5వేల జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో రూ. 1500 కోట్లతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. దేశ ఆత్మనిర్భర్, ఆత్మ విశ్వాసానికి హైదరాబాద్ కేంద్రమని ప్రధాని మోడీ అన్నారు.
8:11 PM, 3 Jul
రీజినల్ రింగ్ రోడ్ కూడా కేటాయించాం. హైదరాబాద్ లో సైన్స్ సిటీ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలుగులో సైన్స్ టెక్నాలజీ చదువులుంటే ఎంత బాగుంటుందన్నారు. రైతుల కోసం ఎంఎస్పీని పెంచామన్నారు.
8:11 PM, 3 Jul
రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించామని ప్రధాని మోడీ తెలిపారు. దీంతో దేశంలో ఎరువుల కొరత తీరుతుందన్నారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోంది.
8:10 PM, 3 Jul
ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి లక్షలాదిగా హాజరైన అభిమానులు మోడీ మోడీ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారందరికీ ప్రధాని మోడీ మరోసారి ధన్వవాదాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పెద్ద పాత్ర పోషిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
8:10 PM, 3 Jul
2019లో తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. 2019 నుంచి తెలంగాణలో బీజేపీ బలపడుతూనే వస్తుందన్నారు.
8:10 PM, 3 Jul
వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.
8:09 PM, 3 Jul
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇప్పటికే ఘన విజయం సాధించామన్నారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
8:09 PM, 3 Jul
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ తెలంగాణకు సహకరించామని, ఉచిత రేషన్, వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు.
8:09 PM, 3 Jul
ధైర్యసాహసాలు, కళలు, సాంస్కృతికి తెలంగాణ రాష్ట్రం సూర్తిదాయమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు ప్రధాని మోడీ.
8:08 PM, 3 Jul
ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ప్రారంభంలో హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్ అంటూ ప్రస్తావించారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ ఈ విధంగా ఉచ్ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా మార్పు తథ్యమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
7:22 PM, 3 Jul
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ నడుచుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు.
7:20 PM, 3 Jul
మొదట ఆయన తెలుగులోనే కాసేపు మాట్లాడారు. భాగ్య లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
7:19 PM, 3 Jul
తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ భారీ బహిరంగలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.
7:01 PM, 3 Jul
పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం తెలుగులో మాట్లాడుతూ ప్రారంబించారు.
6:56 PM, 3 Jul
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని బండి సంజయ్ అన్నారు.
6:52 PM, 3 Jul
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి, మాఫియాపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
6:51 PM, 3 Jul
పరేడ్ గ్రౌండ్స్‌కు లక్షలాదిగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు తరలిరావడంపై బండి సంజయ్‌ను ప్రధాని మోడీ భుజం తట్టి అభినందించారు.
6:49 PM, 3 Jul
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
6:48 PM, 3 Jul
ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.
6:45 PM, 3 Jul
అంతకుముందు పలువురు కేంద్రమంత్రులు, సీఎంలు మాట్లాడారు.
6:45 PM, 3 Jul
పరేడ్ గ్రౌండ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. మోడీకి ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు.
6:30 PM, 3 Jul
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఇప్పుడే పరేడ్ గ్రౌండ్ చేరుకున్నారు.
6:10 PM, 3 Jul
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా స్పష్టం చేశారు.
6:09 PM, 3 Jul
ప్రధాని నరేంద్ర మోడీ హెచ్ఐసీసీ నుంచి హెాలికాప్టర్‌లో పరేడ్ గ్రౌండ్ సభకు బయల్దేరారు.
6:01 PM, 3 Jul
కేసీఆర్ సర్కారుకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.
5:59 PM, 3 Jul
పరేడ్ బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
READ MORE

English summary
BJP National Executive meeting at Hyderabad live details are here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X