India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు: మోడీపర్యటనకు మూడంచెల భద్రత; హైసెక్యూరిటీ జోన్‌గా ఆ ప్రాంతాలు!!

|
Google Oneindia TeluguNews

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మాదాపూర్లోని హెచ్ఐసిసి సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించాలని తెలంగాణా రాష్ట్ర పోలీసు విభాగం భావిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రధాని మోడీ పర్యటన .. మూడంచెల భద్రతా ఏర్పాట్లు

ప్రధాని మోడీ పర్యటన .. మూడంచెల భద్రతా ఏర్పాట్లు

జులై 2న హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు, జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా భద్రతలో భాగంగా కనీసం 5 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సమావేశ వేదిక వెలుపల రాష్ట్ర పోలీసులు మూడంచెల భద్రతా విధానాలను అమలు చేయడం ద్వారా భద్రతను నిర్వహిస్తారని సమాచారం.

భద్రతా చర్యల వివరాలు తెలుసుకుంటున్న పీఎంఓ

భద్రతా చర్యల వివరాలు తెలుసుకుంటున్న పీఎంఓ

అయితే ఎస్పీజీ కమాండోలు మరియు కేంద్ర భద్రతా సిబ్బంది హెచ్ఐసిసి మరియు నోవాటెల్ మైదానాల్లో కాపలాగా ఉంటారని సమాచారం. ఎస్పి జి లు మరియు ఇతర కేంద్ర బలగాలతో కమ్యూనికేట్ చేయడానికి మరియు భద్రతా సంస్థలతో సమన్వయం చేయడానికి, పరిమిత సంఖ్యలో ఐపీఎస్అ ధికారులను మాత్రమే సమావేశ మందిరం లోపల అనుమతించమని అత్యున్నత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మరియు ఎస్పీజీ సీనియర్ అధికారులు తెలంగాణ పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా చర్యల గురించి ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వరకు ట్రయల్‌ రన్‌

బేగంపేట విమానాశ్రయం నుంచి మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వరకు ట్రయల్‌ రన్‌


ప్రధానమంత్రి మోడీకి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను రూపొందించడంపై తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. భద్రతా సన్నాహాలను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించారు. వాతావరణ నివేదికను పొందాలని భద్రతా అధికారులు వాతావరణ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. విమానాలు సజావుగా రాకపోకలు సాగించేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

 హోటల్స్ క్షుణ్ణంగా తనిఖీ.. సిబ్బంది డేటా పరిశీలన

హోటల్స్ క్షుణ్ణంగా తనిఖీ.. సిబ్బంది డేటా పరిశీలన

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, పరిసర జిల్లాల్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రుల భద్రత కోసం అదనపు బందోబస్తును సిద్ధంగా ఉంచాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే జాతీయ కార్యవర్గ సమావేశాలు 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వారి కోసం ఇప్పటికే హోటల్స్ లో బస కోసం రూమ్ లను బ్లాక్ చేశారు. ఇక హోటల్స్ లో పని చేస్తున్న వారి ఆధార్ తో పాటు వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్న పోలీసులు వారికి ప్రత్యేకమైన ఐడీ కార్డులను జారీ చేస్తున్నారు. వారికి నేరచరిత్ర ఉందా అన్నది తనిఖీ చేస్తున్నారు.

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులదే పీఎం మోడీ బస నిర్ణయం

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులదే పీఎం మోడీ బస నిర్ణయం

నగరంలోని రాజభవన్ లేదా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్ళు నోవా టెల్, వెస్టిన్, ఐటీసీ కోహినూర్ లలో ఏదో ఒక చోట ప్రధాని నరేంద్ర మోడీ బస చేస్తారని తెలుస్తోంది. ఇక ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులదే ఆయన బస విషయంలో తుది నిర్ణయమని తెలంగాణ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల లోనూ మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

English summary
Police are expected to make the surrounding areas, including the HICC in Madhapur, a high-security zone in the wake of the BJP national executive meetings. A three-tier security is being set up for Modi's visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X