వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోపం ఎక్కడుంది. అవకాశాలున్నా ఎందుకు బలోపేతం కావడం లేదు.....

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నామని బిజెపి జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు పార్టీ ఎదుగుదలకు అనుకూలంగా వాటిని అనుకూలంగా మలుచుకోవడంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందుతోందని అభిప్రాయంతో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నర ఏళ్ళ సమయం ఉన్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే....ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు తమకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతుండేవారు. రాష్ట్రం ఏర్పాటై రెండున్నర ఏళ్ళు కావస్తున్నా బిజెపి నాయకత్వం వ్యవహారిస్తున్న తీరు జాతీయ నాయకత్వానికి మాత్రం నచ్చడం లేదు.రాష్ట్రంలో బిజెపికి అనుకూలమైన వాతావరణం ఉన్నా......దాన్ని సక్రమంగా వినియోగించుక్ోవడం లేదని ఆ పార్టీ జాతీయ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.ఇ దే విషయాన్ని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి చెప్పింది.

Bjp national leadership unhappy about telangana leadership

రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాలపై కేంద్రీకరించి పనిచేయాలని బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులకు సూచించింది. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో 75 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణను సిద్దం చేయాలని సూచించింది.గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని బిజెపి నాయకత్వం స్థానిక నాయకులకు సూచించింది.రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాల్లో కేంద్రీకరించి పనిచేయాలని....వాటిలో కొన్నింటినైనా గెలిచి తీరాలని కేంద్ర నాయకత్వం తేల్చి చెప్పింది.గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాు తగ్గినా...తెలంగాణలో గెలిచే స్థానాలతో భర్తీ చేసుకోవాలని బిజెపి నాయకత్వం తలపెట్టింది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం చేసిన సూచనల ప్రకారంగా పనిచేయాలని బిజెపి జాతీయ నాయకత్వం సూచించింది.పద్దతిని మార్చుకోకపోతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి జాతీయ పుల్ టైమర్లు రంగంలోకి దిగుతారని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేసింది.

English summary
Bjp national leadership unhappy about telangana leadership. political situation is comfort for gain for bjp in telangana. But local state comitte not capture this situation. so national leadership unhappy about this. bjp national leaders advise to local comitte concertante 13 parliament, 75 assembly constituences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X