వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బీజేపి బ‌లోపేతం పై అమీత్ షా క‌స‌ర‌త్తు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపి సంస్థాగ‌త బ‌లోపేతం పై ద్రుష్టి కేంద్రీక‌రించింది. తొలి విడత‌గా తెలంగాణా లోని 17పార్లిమెంట‌రీ పార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌టిష్ట‌త‌పై అద్య‌య‌నం చేస్తున్నారు ముఖ్యనేత‌లు. అందుకోసం కేంద్ర నాయ‌కులు కూడా రంగంలోకి దిగి రాష్ట్ర నాయ‌క‌త్వానికి త‌గు సూచ‌న‌లు చేస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో ద‌క్ష‌ణ భార‌త దేశ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల మార్పు తెలంగాణ నుండే జ‌రుగుతుంద‌ని బీజేపి విశ్వ‌సిస్తోంది. ఆ మేర‌కు తెలంగాణాలో పావులు కూడా క‌దుపుతోంది మోదీ - అమీత్ షా జోడి.

తెలంగాణలో పార్టీ ప‌టిష్ట‌త‌పై అమీత్ షా ద్రుష్టి...

తెలంగాణలో పార్టీ ప‌టిష్ట‌త‌పై అమీత్ షా ద్రుష్టి...

ఉత్త‌ర భార‌త‌దేశాన్ని త‌మ రాజ‌కీయ చ‌తుర‌త‌తో కాషాయమ‌యం చేసిన మోడీ అమీత్ షా జోడి ద్రుష్టిని ప్ర‌స్తుతానికి తెలంగాణ పై కేంద్రీక‌రించ‌బోతున్నారు. ద‌క్ష‌ణ భార‌త దేశం లో కూడా పార్టీని విస్త్రుతం చేయాల‌నుకున్న మోడీ ద్వ‌యానికి క‌ర్ణాట‌క‌లో చేదు అనుభ‌వం ఎదురైంది. ఐన‌ప్ప‌టికి చెర‌గ‌ని ఆత్మ‌విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో స‌త్తా చాటేందుకు పావులు క‌ద‌ప‌బోతున్నారు. అందుకోసం తెలంగాణ బీజేపి నాయ‌కత్వం జాతీయ పార్టీకి కావ‌ల‌సిన ముడి స‌రుకును అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ 17 పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌పైన క‌న్నేసిన బీజేపి గెలుపు అంశాల‌పైన వ్యూహం ర‌చిస్తోంది.

నాలుగు క్ల‌ష్ట‌ర్లుగా 17పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు..

నాలుగు క్ల‌ష్ట‌ర్లుగా 17పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు..

క్షేత్ర స్థాయిలో బ‌లాబ‌లాలు, ఇత‌ర పార్టీల ప్ర‌భావం, అదికార పార్టీపై ప్ర‌జ‌ల అభిప్రాయాలు, పొత్తు రాజ‌కీయాలు త‌దిత‌ర అంశాల‌పై విశ్లేష‌న చేస్తోంది రాష్ట్ర బీజేపి. ఇవే ప‌రిణామాల‌పైన జాతీయ అద్య‌క్షుడు అమీత్ షాకు నివేదిక‌లు కూడా పంపించారు రాష్ట్ర నేత‌లు.తెలంగాణలోని 17 పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల‌ను నాలుగు క్ల‌ష్ట‌ర్లుగా విభ‌జించారు. అమీత్ షా సూచ‌న‌ల మేర‌కు విభ‌జించిన క్ల‌ష్ట‌ర్లకు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్, బీహార్ బీజేపి మంత్రి మంగ‌ళ్ పాండే, పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ ఆర్గ‌నైసింగ్ సెక్ర‌ట‌రీ సౌథాన్ సింగ్, కేంద్ర మంత్రులు హ‌న్స్ రాజ్ గంగారాం అహీర్య తో పాటు న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ లు ఇంచార్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తారు.అంతే కాకుండా ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కు రెండుసార్లు ఈ క్ల‌ష్ట‌ర్ల పై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. రాబోవు సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం లోపు ఆయా క్ల‌ష్ట‌ర్ల ప‌రిదిలో గెలుపు అంశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అదిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు ల‌క్ష్మ‌ణ్, కిష‌న్ రెడ్డి, చింత‌ల రాంచంద్రారెడ్డి, ఇంద్ర‌సేనారెడ్డి, ద‌త్తాత్రేయ త‌దిత‌ర నాయ‌కుల‌తో క్ల‌ష్ట‌ర్ల‌ ప‌రిశీల‌కులు వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

జూన్ రెండో వారంలో తెలంగాణ‌లో అమీత్ షా ప‌ర్య‌ట‌న‌..

జూన్ రెండో వారంలో తెలంగాణ‌లో అమీత్ షా ప‌ర్య‌ట‌న‌..

ప్ర‌థ‌మిక నివేదిక రూపొందించిన త‌ర్వాత జాతీయ అద్యక్షుడు అమీత్ షాతో భేటీ కాబోతున్నారు నాయ‌కులు. ఇందుకు సంబందించి రాష్ట్ర అద్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఢిల్లీలో అమీత్ షాతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. ఈ నెల రెండవ వారంలో అమీత్ షా తెలంగాణలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. అమీత్ షాతో స‌మావేశం కాబోతున్న క్ల‌ష్ట‌ర్ల ఇంచార్జులు పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సాదించిన పురోగ‌తిని వివ‌రిస్తారు. అమీత్ షా సూచ‌న‌ల మేర‌కు మ‌రికొంత‌మందిని క్ల‌ష్ట‌ర్ల ప‌రిశీలకులుగా నియ‌మించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గాల క‌స‌ర‌త్తు త‌ర్వాత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ద్రుష్టి కేంద్రీక‌రించేందుకు బీజేపి స‌న్న‌ద్దం అవుతోంది.

గులాబీ పార్టీ బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌పై ఆరా..

గులాబీ పార్టీ బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌పై ఆరా..

119 నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించేందుకు బీజేపి ఇప్ప‌టినుండే ప్న‌ణాళిక ర‌చిస్తోంది. ప‌టిష్టంగా ఉన్న గులాబీ పార్టీని ఎదుర్కొనేందుకు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్దం చేస్తోంది జాతీయ బీజేపి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంత ఆర్థిక సాయం చేసింది, సాగు, త్రాగు నీటి ప్రాజెక్టుల‌లో అందించిన స‌హ‌కారం, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న త‌దిత‌ర అంశాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళికా ప్ర‌కారం ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది. అందుకోసం క్షేత్ర స్థాయిలో అదికార పార్టీ బ‌లం, బ‌ల‌హీన‌త‌ల‌పైన ఆరా తీస్తోంది బీజెపి. జూన్ రెండో వారాంలో అమీత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న ద‌క్ష‌ణ భార‌త రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌కు నాంది ప‌ల‌క‌బోతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణను త‌మ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు అమీత్ షా, మోడీ అనుస‌రిస్తున్న వ్యూహాల‌ ప‌ట్ల గులాబీ బాస్ కేసీఆర్ ఎలా ప్ర‌తిస్పందిస్తారో చూడాలి.

English summary
bjp wants to strengthen in telangana, bjp national president amith sha appointed parliamentary incharges for telangana. next general elections bjp expecting to contest total 119 constituencies in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X