India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఢిల్లీ నుంచి మంచి గిఫ్ట్ తీసుకువ‌స్తున్న న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా?

|
Google Oneindia TeluguNews

దేశంలో క‌రోనా కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లంతా క‌నీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. కేరళ, మహారాష్ట్రతోపాటు దేశమంతా గడిచిన 24 గంటల్లో 18,819 కేసులు న‌మోదుకాగా 39 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టికీ దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు పైగా ఉన్నాయి. అందులోను తెలంగాణ‌లో కేసుల సంఖ్య పెరుగుతోంద‌ని, హైద‌రాబాద్ లో ఉధృతంగా ఉన్నాయ‌ని, కానీ లెక్క‌కు అంద‌డంలేద‌ని వైద్య‌నిపుణులు భావిస్తున్నారు.

 క‌రోనా హాట్‌స్పాట్‌గా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు

క‌రోనా హాట్‌స్పాట్‌గా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు


ఇటువంటి త‌రుణంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ఇత‌ర పార్టీ ప్ర‌ముఖులు జులై 2, 3 తేదీల్లో హైద‌రాబాద్‌లో జ‌రిగే జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో పాల్గొంటున్నారు. భారీ బ‌హిరంగ‌స‌భ‌ను పార్టీ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ‌లో త‌మ స‌త్తా నిరూపించుకోవాల‌ని స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఒక‌ర‌కంగా ఈ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు క‌రోనా హాట్ స్పాట్‌గా మార‌బోతున్నాయ‌ని వైద్య‌నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు వెళ్లిందంటూ నానా హ‌డావిడి

ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు వెళ్లిందంటూ నానా హ‌డావిడి

కొవిడ్ ప్రారంభంలో ఢిల్లీలోని జామా మ‌సీదులో ముస్లిం సోద‌రులు ప్రార్థ‌న‌లు చేసుకొని ఎవ‌రింటికి వారు తెరిగి వెళ్లిపోయిన త‌ర్వాత ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు క‌రోనా వ్యాప్తి చెందిందంటూ నానా హ‌డావిడి చేసిన ప్ర‌భుత్వం క‌రోనా రెండోద‌శ‌లో చేతులెత్తేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది హ‌రిద్వార్ కుంభ‌మేళా కూడా హాట్ స్పాట్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచి సాధువుల‌కేకాదు.. స్థానికంగా ఉండే ప్ర‌జ‌లంద‌రికీ కొవిడ్ సోకింది.

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
 నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జ‌రిమానా

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జ‌రిమానా

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా ఉధృతిపై అప్ర‌మ‌త్త‌మైంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌వారికి వెయ్యిరూపాయ‌ల జ‌రిమానా విధిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీ‌నివాస్ ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం కావాలంటూ వీడియో కాన్ఫ‌రెన్స నిర్వ‌హించిన ప్ర‌తిసారీ మోడీ ముఖ్య‌మంత్రుల‌కు సూచించేవారు. ఇప్పుడు ఆయ‌నే స్వ‌యంగా క‌రోనాను హైద‌రాబాద్‌కు మోసుకొస్తున్నార‌ని, ఆ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, సాధ్య‌మైనంత‌వ‌ర‌కు దూరంగా ఉంటే మంచిద‌ని తెలంగాణ వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌కు చెందిన వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు.

English summary
BJP National Working Committee meetings are going to become Corona hot spot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X