వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఆర్ఎస్ రద్దు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం బీజేపీ నిరసన .. ఉద్రిక్తత,అరెస్ట్ లపై బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ రద్దు డిమాండ్ తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బిజెపి ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బిజెపి నాయకులు, బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ ల వద్ద నిరసన దీక్షలు చేపట్టారు.

కొన్ని జిల్లాలలో బిజెపి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.

కొన్ని జిల్లాలలో బిజెపి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది.

వరంగల్ అర్బన్ జిల్లాలో బీజేపీ నిరసన ఉద్రిక్తం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో బిజెపి నాయకులకు,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 జనగామలో కలెక్టరేట్ అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు

జనగామలో కలెక్టరేట్ అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు


ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామలో కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకుల నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు కారణమైంది . జనగామ జిల్లా కలెక్టరేట్ అద్దాలను బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య జరిగిన ఘర్షణ కారణంగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 నల్గొండ జిల్లాతో పాటు అన్ని జిల్లాలలోనూ నిరసనల పర్వం

నల్గొండ జిల్లాతో పాటు అన్ని జిల్లాలలోనూ నిరసనల పర్వం

మరోపక్క నల్గొండ జిల్లాలోనూ బిజెపి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కొనసాగింది . కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్గొండ జిల్లాలోనూ ఆందోళన కొనసాగింది. కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ ఇలా అన్ని జిల్లాలలో బిజెపి నాయకులు ఎల్ఆర్ఎస్ రద్దుకు డిమాండ్ చేస్తూ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు . ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈమేరకు ట్వీట్ చేశారు.

 అరెస్ట్ లపై బండి సంజయ్ ఆగ్రహం .. కేసీఆర్ మోసం ప్రజలు గుర్తించారంటూ ట్వీట్

అరెస్ట్ లపై బండి సంజయ్ ఆగ్రహం .. కేసీఆర్ మోసం ప్రజలు గుర్తించారంటూ ట్వీట్


రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలను, హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. బిజెపి నిరసన కార్యక్రమాలపై మాట్లాడుతూ అబద్ధాలు అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం ప్రభుత్వ అమానవీయ చర్యకు నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయడంలో ఉద్యమస్ఫూర్తి చాటారని బండి సంజయ్ పేర్కొన్నారు.

English summary
The BJP today staged a protest in front of all district collector's offices against the TRS government's stance aims to exploit the poor in the case of double bedroom houses along with the demand for abolition of LRS across the state. BJP leaders and BJP activists staged protests at collectorates in all districts across the state. The BJP collectorate siege program in some districts has led to tension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X