వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్, తెలంగాణ, మరియు ఏపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం .. ఏంపీ మాజీ సీఎం

|
Google Oneindia TeluguNews

బెంగాల్, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కాశ్మీర్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు ప్రణాళికలు చేసిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రముఖ్ హాదాలో తెలంగాణకు వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు..ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటంభ పాలనతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.

Recommended Video

రాష్ట్రానికి చంద్రగ్రహణం వీడే వరకు యాత్ర - లక్ష్మణ్
తెలంగాణలో 20 శాతం ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు

తెలంగాణలో 20 శాతం ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు

ఈనేపథ్యంలోనే ప్రధాన మంత్రీ మోడీ మోదీ పాలన తీరుతోపాటు అమిత్ షా నాయకత్వ ప్రతభ తోనే కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఇందులోభాగంగానే తెలంగాణ ప్రజలు బీజేపీని అదరించారని అన్నారు. బెంగాల్, తెలంగాణ లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు...బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈనేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటుందని చెప్పారు.ఇందులో భాగంగానే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ , కశ్మీర్, బెంగాల్ రాష్ట్ర్రాల్లో అధికారమే లక్ష్య్యంగా పని చేస్తున్నామని చెప్పారు.

2023 కల్లా తెలంగాణలో పార్టీ బలోపేతం

2023 కల్లా తెలంగాణలో పార్టీ బలోపేతం

తెలంగాణపై ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పిన అయన జూలై ఆరున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.తెలంగాణలోని అన్ని పోలింగ్ బూత్‌లలో సభ్యత్వ నమోదును చేయించి, 2023 కల్లా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఈనేపథ్యంలోనే దేశంలోని అన్ని వర్గాలను బీజీపీలోకి తీసుకువచ్చే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని అన్నారు..ఇందులో భాగంగానే క్రిడాకారులు , కళాకారులను సైతం పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు.

నీతీ అయోగ్‌కు వెళ్లి ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యోవి...

నీతీ అయోగ్‌కు వెళ్లి ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యోవి...

ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై చౌహాన్ విమర్శలు చేశారు..15 సంవత్సారాలుగా తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశానని, అయితే ఒక్కరోజు కూడ సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని తాను చూడలేదని అన్నారు. ఇక నీతి అయోగ్ సమావేశానికి వెళ్లి ఉంటే తెలంగాణ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం దక్కేదని అన్నారు.అప్పుడు తెలంగాణకు మరిన్ని నిధులు కూడ వచ్చేవని అన్నారు.. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు.

English summary
The BJP's aimed at coming to power in Tamil Nadu and Kashmir along with Bengal, AP and Telangana. said Former Madhya Pradesh chief minister Shivraj Singh Chauhan.He came to Telangana under the BJP's National Membership Pramukh and spoke at the BJP office in Hyderabad.He criticized the Telangana Chief Minister KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X