వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ .. టీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ తో మోడీ సభపై ఆసక్తి

|
Google Oneindia TeluguNews

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తుంది. పార్టీ అగ్రనేతలతో తెలంగాణలో వరుస సభలు నిర్వహించి బీజేపీ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు . అందులో భాగంగా నేడు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు . విజయ సంకల్ప సభ మోడీ పాల్గొనుండటంతో బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

<strong>ఏ క్యా పబ్లిసిటీ హై... మొన్న వెడ్డింగ్ కార్డులు నేడు చీరలపై మోడీ ఫోటోలు</strong>ఏ క్యా పబ్లిసిటీ హై... మొన్న వెడ్డింగ్ కార్డులు నేడు చీరలపై మోడీ ఫోటోలు

ఎల్బీ స్టేడియంలో మొన్న టీఆర్ఎస్ సభ ప్లాప్ .. నేడు బీజేపీ సభపై అందుకే ఆసక్తి

ఎల్బీ స్టేడియంలో మొన్న టీఆర్ఎస్ సభ ప్లాప్ .. నేడు బీజేపీ సభపై అందుకే ఆసక్తి

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం .. ఎన్నికల సమయంలో సభలకు వేదికగా మారింది. మొన్న టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో జనాలు రాకపోవడంతో కెసిఆర్ సభకు హాజరు కాలేదు. దీంతో ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక నేడు సోమవారం బీజేపీ విజయ సంకల్ప సభ పేరుతో ఎల్బీ స్టేడియంలోనే ఎన్నికల ప్రచార సభను నిర్వహించనుంది. మోడీ పాల్గొనే ఈ సభ పై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.కేసీఆర్ సభలా ఉంటుందా లేకా జనాలు అధిక సంఖ్యలో పాల్గొంటారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.

పాలమూరు సభ సక్సెస్ జోష్ లో బీజేపీ నేతలు .. నేడు పార్టీలో చేరనున్న కాంగ్రెస్ నాయకులు

పాలమూరు సభ సక్సెస్ జోష్ లో బీజేపీ నేతలు .. నేడు పార్టీలో చేరనున్న కాంగ్రెస్ నాయకులు

పాలమూరులో మోడీ సభ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ నేతలు ఎల్బీ స్టేడియంలో పీఎం మోడీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.నేటి ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న సభలో పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. మాజీమంత్రి విజయరామారావు కూడా బీజేపీలో చేరుతున్నారనీ సోమవారం సభతో తెలంగాణ రాజకీయాల్లో బిజెపి బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బిజెపి నాయకులు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కెసిఆర్ టార్గెట్ గా విరుచుకుపడబోతున్నారని తెలుస్తోంది.

పీఎం మోడీ సభ నేపధ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు

పీఎం మోడీ సభ నేపధ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు

ఇక బీజేపీ తెలంగాణలో పట్టు కోసం , అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభలో పీఎం నరేంద్ర మోడీ పాల్గొననున్న నేపధ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 8మంది అదనపు డీసీపీలు, 16మంది ఏసీసీలు, 80 మంది ఇన్ స్పె క్టర్లు , 160 మంది ఎస్సైలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

English summary
The BJP leaders who are enthusiastic about Modi's campaign success in Palamur are making huge arrangements for the PM Modi's public meeting in the LB Stadium. Recently the TRS party meeting was fail due to the lack of people . KCR did not participate in the meeting . It is interesting to see how the Modi's public meeting in LB Stadium will be held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X