• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Mothkupally Narsimhulu: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్... టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి...?

|

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం (జులై 23) మీడియా ముందుకు రానున్న ఆయన అధికారికంగా రాజీనామా ప్రకటిస్తారని సమాచారం. బీజేపీని వీడిన తర్వాత త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కొత్తగా తీసుకొచ్చిన 'దళిత సాధికారత పథకం'(దళిత బంధు) బీజేపీలో మోత్కుపల్లికి,ఆ పార్టీ నాయకత్వానికి మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ ఆదేశాలను కాదని.. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైనప్పటి నుంచి.. మోత్కుపల్లిని ఆ పార్టీ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. పైగా సీనియర్ నేత అయినప్పటికీ పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో మోత్కుపల్లి సైతం కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో 'మోత్కుపల్లి' దుమారం-కుండ బద్దలు కొట్టిన సీనియర్ నేత-భయపడేది,బాధపడేది లేదని...బీజేపీలో 'మోత్కుపల్లి' దుమారం-కుండ బద్దలు కొట్టిన సీనియర్ నేత-భయపడేది,బాధపడేది లేదని...

బీజేపీ నాయకత్వానికి-మోత్కుపల్లికి మధ్య చిచ్చు...

బీజేపీ నాయకత్వానికి-మోత్కుపల్లికి మధ్య చిచ్చు...

గత నెల 27న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలు,రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను,సామాజిక కార్యకర్తలను,ఆయా రంగాల్లో దళితుల కోసం కృషి చేస్తున్నవారిని సమావేశానికి ఆహ్వానించారు. బీజేపీ నేత మోత్కుపల్లికి కూడా ఆహ్వానం అందింది. దీంతో ఆయన సమావేశానికి హాజరయ్యారు. అయితే బీజేపీ నాయకత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించగా మోత్కుపల్లి హాజరవడం పార్టీలో చిచ్చు రేపింది. పార్టీ నాయకత్వానికి,ఆయనకు మధ్య గ్యాప్ పెరిగింది. దానికి తోడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి మంత్రిగా పనిచేసి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదని మోత్కుపల్లి భావిస్తున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

బీజేపీకి మింగుడుపడని వ్యవహారం...

బీజేపీకి మింగుడుపడని వ్యవహారం...

సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత మోత్కుపల్లి బీజేపీపై ఒకింత స్వరం పెంచారు. ఇప్పటికే బీజేపీకి,దళితులకు మధ్య గ్యాప్ ఉందని... ఇలాంటి తరుణంలో తాను దళిత ప్రజాప్రతినిధిగా బీజేపీ తరుపున ఆ సమావేశానికి హాజరుకావడం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లయిందని అన్నారు. అంతేకాదు,దళిత సాధికారత పథకాన్ని,ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన తీరును ప్రశంసించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి దళితుల కోసం ఇంత సమయం వెచ్చించి వారి సమస్యలపై చర్చించలేదని అన్నారు. దళితులకు మేలు జరుగుతుంటే ఆ వర్గానికి చెందిన నేతగా తాను వెళ్లకపోతే ఎలా అని పార్టీని నిలదీశారు. పైగా పార్టీ నాయకత్వానికి చెప్పే తాను వెళ్లానని... ఎక్కడా పార్టీ లైన్‌ను దాటలేదని తెలిపారు. అయితే మోత్కుపల్లి కేసీఆర్‌ను,ఆయన తీసుకొచ్చిన పథకాన్ని ప్రశంసించడం బీజేపీకి మింగుడుపడలేదు.

ప్రాధాన్యం లేని ఉండవద్దనే...

ప్రాధాన్యం లేని ఉండవద్దనే...


ఆ సమావేశానికి హాజరై వచ్చాక కేసీఆర్‌పై మోత్కుపల్లి స్వరం మారుతోందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపించాయి. అయితే మోత్కుపల్లి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. పైగా తానేమీ పైరవీకారుడిని కాదని... వ్యాపార లావాదేవీల కోసం రాజకీయాలు చేయట్లేదని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి వచ్చే విమర్శలకు భయపడేది,బెదిరేది లేదని గట్టిగానే మాట్లాడారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చానని... తానేమీ తొందరపడట్లేదని తెలిపారు. మొత్తం మీద మోత్కుపల్లి వ్యాఖ్యలతో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. దీంతో పార్టీ నాయకత్వం ఆయన్ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత లేని చోట ఉండటం తన విలువను తగ్గించుకోవడమేనని మోత్కుపల్లి కూడా భావించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీని వీడి ఆయన కారెక్కుందు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అదే టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన మోత్కుపల్లి కూడా ఇప్పుడు గులాబీ గూటికే చేరుతుండటం గమనార్హం.

  Motkupalli Narasimhulu On KCR దళితులకు మూడెకరాల భూమి మాత్రం అందడం లేదు | Oneindia Telugu

  English summary
  It seems that Telangana BJP senior leader Mothkupalli Narsimhalu might quit the party. On Thursday (July 22) he come infront of media and announce his resignation officially,according to the sources.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X