వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘పవన్ కళ్యాణ్‌ది టీఆర్ఎస్ పార్టీ బి-టీం, జనసేన రాజకీయ పార్టీయా? బ్రోకరేజి సంస్థా?’’

పవన్ కళ్యాణ్ యాత్రపై బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ పార్టీనా లేదంటే బ్రోకరేజీ సంస్థనా? అని ఆయన ప్రశ్నించారు. జనసేనకు రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు లేవన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ యాత్రపై బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన రాజకీయ పార్టీనా లేదంటే బ్రోకరేజీ సంస్థనా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ లేవన్నారు.

పవన్‌ కళ్యాణ్‌, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన విజయశాంతి!పవన్‌ కళ్యాణ్‌, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన విజయశాంతి!

జనసేన పార్టీకి లోగో ఉంది కానీ.. సిద్ధాంతం లేదు, జెండా ఉంది కానీ.. అజెండా లేదు. పవన్ ఇటు ఆంధ్రలో, అటు తెలంగాణలో ప్యాకేజీలు తీసుకుంటున్నారు. జనసేన రిలీజ్ కాకముందే ఫ్లాప్ అయిన సినిమా అంటూ కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు.

pawan-krishnasagar-rao

'పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి. ఆయన గతంలో కేసీఆర్ సహా తెలంగాణ పోరాట యోధులను విమర్శించారు. కేసీఆర్ కూడా గతంలో పవన్ విమర్శించారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ ఏకంగా పవన్‌ను తన ఇంటికి పిలిపించుకున్నారు. పవన్ కూడా కేసీఆర్ భజన చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న ప్రజలే అయోమయానికి గురవుతున్నారు..' అని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే పవన్ తీరు అర్థమవుతుందని, పవన్ కళ్యాణ్ జనసేన.. టీఆర్ఎస్ పార్టీ బి-టీం అని, అధికార పార్టీ ఓటును చీల్చే ఓ అస్త్రమని, తెలంగాణలో, ఏపీలో ఆ పార్టీది అదే తీరు అని కృష్ణసాగర్ రావు విమర్శించారు.

'నిజంగా పవన్‌ కళ్యాణ్‌ది ప్రజాపక్షమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా? భజన చేయడానికి రాజకీయ పార్టీ ఎందుకు? తెలివి, విచక్షణ లేకున్నా ఫర్వాలేదు. కానీ ప్రజాజీవితంలో ఉన్నవారికి నిజాయతీ ఉండాలి. పవన్‌లో అది కొరవడింది. జనసేనలో నెంబర్ టూ కూడా లేరు. దీన్నిబట్టి ఆయన ప్యాకేజీల కోసమే పార్టీని పెట్టారని అర్థం అవుతోంది. అదో పార్టీ.. దానికో యాత్రా..' అంటూ కృష్ణ సాగర్ రావు ఎద్దేవా చేశారు.

అంతేకాదు, రాజకీయం అంటే.. అటు ఆంధ్రాకు వెళ్లి పెరుగన్నం, ఇటు తెలంగాణకు వచ్చి బిర్యానీ తినడం కాదన్నారు. ఎన్నికల హామీల్లో సీఎం కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, పైగా గళమెత్తిన ప్రజాసంఘాల నాయకుల్ని జైల్లో పెడుతున్నారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్‌లో నెల రోజులుగా ఇంటర్నెట్ లేదు. ప్రశ్నించావా? అంటూ కృష్ణ సాగర్ రావు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

English summary
BJP leader Krishna Sagar Rao critisized Janasena and it's Chief Pawan Kalyan here in Hyderabad on Monday. Is Janasena a political party or it is a Brokerage Organization? he asked. Janasena has a logo but doesn't have a theory, not only this it has Flag but not Agenda, Krishna Sagar Rao fired. He told that Pawan's Janasena party didn't have any characteristis which a political party have.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X