వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో ఓటుకు 30వేలు ఇచ్చైనా గెలవాలని కేసీఆర్ కుయుక్తులు; కానీ జరిగేదిదే: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ పాలనను తరిమికొట్టేందుకు ధర్మయుద్ధం ప్రారంభమైందని, అందుకే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు ఏకం కావాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా చౌటుప్పల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచారని, వారికి గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ఓటర్లు కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

మునుగోడు ఉపఎన్నిక కీలకం : బండి సంజయ్

మునుగోడు ఉపఎన్నిక కీలకం : బండి సంజయ్


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమికి, బీజేపీ అధికారంలోకి రావడానికి మునుగోడు ఉప ఎన్నిక కీలకమని, తెలంగాణ భవిష్యత్తును మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గానికి కేంద్ర నిధుల వివరాలను తెలియజేస్తూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి, ప్రతి వీధికి యువత వెళ్లి కేసీఆర్ నియంతృత్వ పాలనను వివరించాలని విజ్ఞప్తి చేశారు, ఏడ్చే తల్లి తెలంగాణను టీఆర్‌ఎస్ బారి నుంచి విముక్తి చేయాలని బండి సంజయ్ కోరారు.

 ఓటుకు 30వేల రూపాయలు టీఆర్ఎస్ ఇస్తుంది .. తీసుకుని బీజేపీకే ఓటెయ్యండి

ఓటుకు 30వేల రూపాయలు టీఆర్ఎస్ ఇస్తుంది .. తీసుకుని బీజేపీకే ఓటెయ్యండి


ప్రతి ఓటుకు రూ.30 వేల చొప్పున వెచ్చించి గెలిపించాలని సీఎం భావిస్తున్నారని, డబ్బులు తీసుకుని టీఆర్‌ఎస్‌ను ఓడించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌'ను తెరకెక్కిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చామని, అదే చేశామని కరీంనగర్ ఎంపీ , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఇప్పుడు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి ఆర్.ఆర్. ఆర్ సీక్వెల్ కు మరో ‘ఆర్‌' చేర్చబోతున్నారు' అని వ్యాఖ్యానించారు.

Recommended Video

ఆజాదీ సాయంతో మోడీ జమిలి ప్లాన్ *National | Telugu OneIndia
బీజేపీ ఒత్తిడితోనే గట్టుప్పల్ మండలం .. కేసీఆర్ ది అంతా రాజకీయమే

బీజేపీ ఒత్తిడితోనే గట్టుప్పల్ మండలం .. కేసీఆర్ ది అంతా రాజకీయమే

నక్కల గండి ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న కేసీఆర్ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మంచి రోడ్లు లేవని ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీళ్లు ప్రజలకు అందడం లేదని, దీని కోసం కేసీఆర్ రూ.40 వేల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. బీజేపీ ఒత్తిడితోనే సీఎం గట్టుప్పల్ మండలంగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నిక నేపథ్యంలోరాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్‌ గట్టుప్పల్ మండలంగా ప్రకటించారని బండి ఆరోపించారు.

అధివృద్ధి అంటే ఇదేనా కేసీఆర్

అధివృద్ధి అంటే ఇదేనా కేసీఆర్

ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ‘నీళ్లు లేవు, రోడ్లు లేవు, కానీ రసాయనాల ఫ్యాక్టరీల వల్ల కలుషితమైన గాలి, నీటితో మునుగోడు ప్రజలు అల్లాడుతున్నారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాలుష్యానికి కారణమైన వారి దగ్గర డబ్బులు తీసుకుని మరి రాజ్యసభ సీటు ఇచ్చారు' అని మునుగోడు ప్రజలు అడుగుతున్నారన్నారు . అభివృద్ధి అంటే ఐదు బార్‌లు, ఏడు వైన్‌షాపులు, 57 బెల్ట్‌షాపులా అని ప్రశ్నించారు. కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ వెల్లడించారు.

తెలంగాణాలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావటం పక్కా

తెలంగాణాలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావటం పక్కా

ఇక తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడి అభివృద్ధి పథంలో పయనించేందుకు బీజేపీ పాలన మాత్రమే దోహదపడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని, కేసీఆర్ అహంకారానికి బుద్ధి చెప్పాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

English summary
Bandi Sanjay commented that a Dharma yuddham had started in munugode.Bandi sanjay alleged TRS would give rs.30,000 for the vote, asked to take and make BJP win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X