వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్ పులి: ఏకేసిన బీజేపీ, 'మోడీకి బయపడి.. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వెనుక వాళ్లే'

టీడీపీ ప్రభుత్వాన్ని మినీ బీజేపీగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనను ట్విట్టర్ పులిగా అభివర్ణించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని మినీ బీజేపీగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనను ట్విట్టర్ పులిగా అభివర్ణించింది. ఆయనకు రాజకీయాలు ఓ పార్ట్‌ టైం వ్యవహారమంటూ ఆరోపించింది. ఏపీకి ప్రత్యేక హోదా రప్పించడంలో వెంకయ్య నాయుడు తగినతంగా చేయలేదని వవన్ ట్వీట్లను కూడా బీజేపీ తిప్పికొట్టింది.

<strong>మోడీకి భారీ షాక్: పవన్ సంచలన నిర్ణయం</strong>మోడీకి భారీ షాక్: పవన్ సంచలన నిర్ణయం

పవన్.. ప్రధాని మోడీపై, వెంకయ్యపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆయన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అనుచితమని చెప్పింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన స్టేట్‌మెంట్లు చాలా సిల్లీగా ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణాసాగర్‌రావు పేర్కొన్నారు.

పవన్‌ ఓ రాజకీయ అవకాశవాదని, ట్విటర్ టైగర్ అని ఆయన విమర్శించారు. ఎవరైనా డ్రైవ్ చేస్తే దానిపై ఎలాంటి ప్రయాస లేకుండా రైడ్ చేయాలనుకోవడం సరికాదన్నారు. పవన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, ట్విట్టర్ల ద్వారా పనిచేసే పార్ట్‌టైం పొలిటీషియన్ మాత్రమేనని ఆరోపించారు.

pawan kalyan

నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై పవన్ కళ్యాణ్ పోరాడాలని, అలా కాకుండా షూటింగ్ షెడ్యూల్స్ నుంచి మెలుకువ వచ్చినప్పుల్లా అర్ధంపర్ధం లేకుండా బీజేపీ, ఆ పార్టీ జాతీయ నాయకులపై ఆరోపణలు చేయడం తగదన్నారు.

<strong>ఇక మీ ఇష్టం!: చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక</strong>ఇక మీ ఇష్టం!: చిరంజీవిని చూపించి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక

కమ్యూనిస్టులు నడిపిస్తున్నారు

పవన్‌‌ను కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు వెనకుండి నడిపిస్తున్నారని బీజేపీ నేత యడ్లపాటి రఘునాథబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.

<strong>మెగా టార్గెట్..: పర్సనల్ విషయాలతో పవన్ వర్సెస్ వర్మ</strong>మెగా టార్గెట్..: పర్సనల్ విషయాలతో పవన్ వర్సెస్ వర్మ

అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని అందుకే ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఎన్నో విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయన్నారు. ఇవన్నీ వెంకయ్య నాయుడు చొరవ వల్లే వచ్చాయన్నారు.

వెంకయ్యను పవన్‌ విమర్శించటం సరికాదన్నారు. ప్రధాని మోడీ అభివృద్ధిపథంపై ప్రజల్లో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో కాంగ్రెస్‌, వామపక్షాలకు భయం పెరిగి పవన్‌ కళ్యాణ్‌తో ఇలాంటి వ్యాఖ్యలు చేయించాయని రఘునాథబాబు విమర్శించారు.

English summary
BJP lashed out at Jana Sena chief Pawan Kalyan for targetting PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X