వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మికులతో గోక్కుంటే... టీఆర్ఎస్ ఇంటికి పోవాల్సిందే... ! బీజీపీ లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మీకులతో గోక్కుంటే టీఆర్ఎస్ ఇంటికి పోవాల్సిందేనని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు సమానంగా ఇస్తామని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారని, ఇప్పుడు కార్మికుల విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ మెడలు వంచి, కార్మికులకు అండగా ఉంటామని అయన ప్రకటించారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రభుత్వానికి బుద్ది చెబుతామని అన్నారు.

టీఆర్ఎస్ ఉద్యోగాలు ఉడగొడుతాం

టీఆర్ఎస్ ఉద్యోగాలు ఉడగొడుతాం

కార్మీకులపై ప్రభుత్వ వ్యవహరిస్తున్న పరాకాష్టకు ఇది నిదర్శనం ఆయన మండిపడ్డారు. గత నెలరోజుల క్రితం కార్మీకులు సమ్మె నోటీసును ఇస్తే స్పందించని సీఎం కేసీఆర్ ,వారిని ఉద్యోగం తీసేందుకు మాత్రం ముందుకు వచ్చారని అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఒక్క నిర్ణయంతో 50వేల కుటుంబాలను రోడ్డుపై పడేస్తే తెలంగాణ ప్రజాస్వామిక వాదులుగా చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి టీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడుతామని హెచ్చరించారు.

ప్రభుత్వ విధానాలే కారణం

ఇక ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే అయన విమర్శించారు. కార్మీకుల ఫీఎఫ్ డబ్బులను వాడుకోవడంతో పాటు డిజిల్‌పై పన్నులను విధించడం నుండి విద్యార్థుల బస్‌పాస్‌లకు సంబంధించి ప్రభుత్వం బకాయిలను చెల్లించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పాసుల బకాయిలే 2500 కోట్ల రుపాయాలు ఉన్నాయని చెప్పారు. లక్ష కోట్ల రుపాయాల ఆస్తులున్న ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

సీఎం నిరంకుశ వైఖరే.. సమ్మెకు కారణం

సీఎం నిరంకుశ వైఖరే.. సమ్మెకు కారణం

సీఎంకు కార్మీకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం లేదని ఇందుకోసమే కార్మీకులు నెలరోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా సీఎం పట్టించుకోలేదని అన్నారు. పండగ ముందు ప్రజలు ఇబ్బందిపడకుండా కార్మీకులతో పిలిచి మాట్లాడేందుకు కూడ ముందుకు రాలేదని దుయ్యబట్టారు.తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ ద్రోహులకు కట్టబెడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రవాణాశాఖ మంత్రి అజయ్ కార్మీకులపై ఎస్మా ప్రయోగిస్తామని చెప్పడంపై ఆయన మండిపడ్దారు. తెలంగాణను అడ్డుకున్నవాళ్లే ఇప్పుడు మంత్రులయ్యారని మండిపడ్డారు.

English summary
BJP Telangana state laxman once again fired on c.m kcr attitude on RTC strike. he said that fully support to rtc union demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X