• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాచిక పారింది.. పాదం మోపింది..! దక్షిణాదిలో అడుగుపెట్టిన బీజేపీ..! నెక్ట్ర్ తెలుగు రాష్ట్రాలేనా..?

|

బెంగళూరు/హైదరాబాద్ : దేశ రాజకీయాలు గత కొంత కాలంగా కర్ణాటక చుట్టే తిరిగాయి. నాయకుల చూపు కూడా గత కొంత కాలంగా కర్ణాటకపైనే కేంద్రీకృతమై ఉంది. కర్ణాటక రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం పట్ల తమకు ఎలాంటి సంబంధం లేనట్టుగా వ్యవహరించిన బీజేపి అధికారం కోసం ఎంతో శ్రమించి, ఫలితం దక్కించెకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు కర్ణాటకలో అధికారం దక్కింది. ఇక మిగిలింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పటికే ఈ రెండు తెలుగురాష్ట్రాల్లో పావులు కదుపుతోంది. కర్ణాటకలో గత గురువారమే జేడీఎస్ ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఐదు రోజులుగా చర్చలు, వాయిదాల పర్వమే కొనసాగింది. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్‌ నిర్వహిస్తానని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించడంతో మిత్రపక్షాలు సిద్ధమయ్యాయి.

ఆరురోజులు ఛాన్స్.. అయినా నో యూజ్.. కుప్పకూలిన కుమార సర్కార్

 మొదటినుంచీ కష్టాలే..! అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న కుమార స్వామి ప్రభుత్వం..!!

మొదటినుంచీ కష్టాలే..! అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న కుమార స్వామి ప్రభుత్వం..!!

మంగళవారం ఉదయం పదింటికి మొదలైన సభకు గంట తర్వాత పాలకపక్ష సభ్యులు హాజరయ్యారు. తమ సభ్యుడు ఎవరూ గైర్హాజరు కాకుండా ప్రతిపక్ష బీజేపీ చూసుకుంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య తాము విశ్వాస పరీక్షకు సిద్ధమన్న సంకేతాలు పంపటంతో మంగళవారం అసలైన పరీక్షకు వేదిక సిద్ధమైంది. ఓటింగ్‌ ఫలితాలను 7.40 గంటలకు స్పీకర్‌ వెల్లడించారు. సభకు హాజరైన సభ్యులు 204 మంది. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 105 ఓట్లు.. అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. ఆ వెంటనే పాలకపక్షం సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. యడ్యూరప్ప నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సభ్యులు విజయ సంకేతాలు చూపుతూ సంబరాలు చేసుకున్నారు. ఓటింగ్‌ ముగిశాక రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం తన రాజీనామాను గవర్నర్‌ వజూభాయి వాలాకు అందజేశారు.

 ఎట్ట కేలకు కల నెరవేర్చుకున్న బీజేపి..! దక్షిణ భారతంలోకి ఎంటర్..!!

ఎట్ట కేలకు కల నెరవేర్చుకున్న బీజేపి..! దక్షిణ భారతంలోకి ఎంటర్..!!

కాంగ్రెస్‌ పార్టీలో జిల్లాలపై ఆధిపత్యానికి మొదలైన అసమ్మతి చివరకు ప్రభుత్వ పతనానికి దారి తీసింది. గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్ఖిహొళితో మొదలైన అసమ్మతి జులై 1న తీవ్రరూపం దాల్చింది. హొసపేట ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ రాజీనామా, ఆ తరువాత కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు 14మంది రాజీనామాలు చేసి ముంబయికి వెళ్లటం సంకీర్ణ ప్రభుత్వాన్ని కోలుకోలేకుండా చేసింది. 2018 మే 23న ఏర్పాటైన ప్రభుత్వం 2019 జులై 23న వైదొలగాల్సి వచ్చింది. 104 స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ మే 17నుంచి 19వరకు అధికారంలో ఉన్నా తర్వాత మిత్రపక్షాల పొత్తుకు తలొగ్గింది. 78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌, 37 స్థానాలతో ఉన్న జేడీఎస్‌, ఇద్దరు స్వతంత్రులు, బీఎస్పీ సహకారంతో సంకీర్ణ కూటమికి బాటలు పడ్డాయి. మే 23న సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి ఈ 14 నెలలూ ఆపసోపాలతోనే పాలన సాగించారు.

 కర్ణాటక పరిణామాలపై స్పందించిన రాహుల్..! బీజేపి పాలనలో ప్రజాస్వామ్యం ఇలా మారిందన్న మాజీ ఛీఫ్..!!

కర్ణాటక పరిణామాలపై స్పందించిన రాహుల్..! బీజేపి పాలనలో ప్రజాస్వామ్యం ఇలా మారిందన్న మాజీ ఛీఫ్..!!

ఓవైపు కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా, మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఓటమితో కాంగ్రెస్ పార్టీ కలవరపడుతోంది. కర్ణాటక ప్రభుత్వం ఓటమికి ఒక పక్క రాహుల్ గాంధీ అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి హోదా నుంచి తప్పుకోవడంతో ఇదే అదునుగా చూసిన బీజేపీ కర్ణాటక ప్రభుత్వంపై పావులు కదిపి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఒకవేల అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పటిష్టంగా ఉండి ఉంటే ఇలాంటి చర్య జరిగుండేది కాదని, నేతల్లో కొంత నమ్మకం ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అదికార కాంక్ష గెలిచింది..! బీజేపి కుట్రపూరిత రాజకీయాలన్న రాహుల్..!!

అదికార కాంక్ష గెలిచింది..! బీజేపి కుట్రపూరిత రాజకీయాలన్న రాహుల్..!!

కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఇంతకాలం మౌనంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మొత్తానికి ఈ రోజు దురాశ గెలిచిందని ఘాటుగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇంటాబయట చిక్కులు మొదలయ్యాయన్నారు. తమ అధికారానికి సంకీర్ణ ప్రభుత్వం అడ్డొస్తుందన్న కారణంతో కుట్రలు చేసి మొత్తానికి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నేడు వారి దురాశ గెలిచిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, నిజాయతీని కర్ణాటక ప్రజలు పోగొట్టుకున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కారు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా సమర్పించారు.

English summary
The politics of the country has been wandering around Karnataka for some time now. The vision of leaders has also been concentrated on Karnataka for some time.There is debate that the BJP, which had no involvement in the crisis in Karnataka politics, has worked hard for power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X