వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ జోరుకు బీజేపీ బ్రేకులు.. ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్న ఇంద్రసేన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ బీజేపీలో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని విమర్శస్తూనే .. కేసీఆర్ లక్ష్యంగా మాటల దాడికి దిగుతున్నారు. పార్టీ చీఫ్ మొదలుకొని ముఖ్యనేతలంతా వరుసగా టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రాసేనా రెడ్డి .. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బలపడుతున్న బీజేపీ
తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతుందని వివరించారు ఇంద్రాసేనా రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో రుజువైందని పేర్కొన్నారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పడిన ఓట్ల గురించి వివరించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేయడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు చూశారన్నారు. అప్పుడు తమకు ఉన్న ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారని గుర్తుచేశారు. అంతేతప్ప టీఆర్ఎస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు కాదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల నుంచి ప్రజల మూడ్ మారిందని గుర్తుచేశారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తట్ట బుట్ట సర్దుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

bjp will strenthen in telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రజల కోసం చేసింది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీఆర్ఎస్ పార్టీ కోసం చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ కులాలతో రాజకీయం చేస్తుందని తప్పుపట్టారు.

English summary
Indrasena Reddy explained that BJP is gradually strengthening in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X