వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి భారీ డిమాండ్, కాంగ్రెస్‌కు టిక్కెట్ తలనొప్పి: బిజెపి గాలం?

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి డిమాండ్ పెరిగింది! కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓ వైపు ఆయన ఆ పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతుండగానే మరో ఆసక్తికర ప్రచారం జోరందుకుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి డిమాండ్ పెరిగింది! కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓ వైపు ఆయన ఆ పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతుండగానే మరో ఆసక్తికర ప్రచారం జోరందుకుంది.

చదవండి: ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

రేవంత్ రెడ్డి కోసం బిజెపి కూడా ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయనతో పాటు చేరనున్న 25మంది నేతల టిక్కెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

చదవండి: రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి సంచనలం, కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు

అలర్ట్ అయిన బిజెపి

అలర్ట్ అయిన బిజెపి

ఈ నేపథ్యంలో బిజెపి కూడా రంగంలోకి దిగిందని తెలుస్తోంది. రేవంత్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, ఆయనతో వచ్చే 25 మంది నేతల టిక్కెట్ విషయమై సస్పెన్స్ కొనసాగుతోందనే ప్రచారం నేపథ్యంలో బిజెపి అలర్ట్ అయింది.

బిజెపికి చిక్కుతారా

బిజెపికి చిక్కుతారా

రేవంత్ రెడ్డితో బిజెపి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సమావేశమయ్యారు. చాలాసేపు వారి మధ్య భేటీ జరిగింది. ఈ సమయంలో బిజెపిలో చేరాలని కూడా ప్రభాకర్.. రేవంత్ రెడ్డిని కోరారని తెలుస్తోంది. అయితే రేవంత్ బిజెపిలో చేరడం గురించి ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నందున బిజెపిలో చేరే అవకాశం లేదంటున్నారు.

తెలంగాణలో బిజెపి లేదంటూ..

తెలంగాణలో బిజెపి లేదంటూ..

తెలంగాణలో బిజెపి లేదని, అందుకే బండారు దత్తాత్రేయను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించారని రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో బిజెపి లేదన్న రేవంత్.. ఆ పార్టీలో చేరడం దాదాపు జరగకపోవచ్చునని అంటున్నారు.

25 మందికి టిక్కెట్ పైనే ట్విస్ట్

25 మందికి టిక్కెట్ పైనే ట్విస్ట్

కాంగ్రెస్‌లో చేరిక విషయమై రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఆయన వరుసగా పలువురు సీనియర్లతో భేటీ అవుతున్నారు. తనతో పాటు ఇరవై ఇరవై ఐదు మంది వరకు టిడిపి కీలక నేతలు వస్తున్నారని, వారిలో చాలామందికి టిక్కెట్లు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి

కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి

రేవంత్ రెడ్డితో పాటు మరో ఐదారుగురికి టిక్కెట్లు ఇస్తేనే ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఆయన చెబుతున్న అంతమందికి టిక్కెట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇందుకోసమే చేరికపై సస్పెన్స్ కొనసాగుతోందని తెలుస్తోంది. అంతమందికి టిక్కెట్లు అంటే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇంచార్జులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు.

English summary
It is sait that Bharatiya Janata Party is wooing Telangana Telugudesam working president Revanth Reddy for joining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X