వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, టీఆర్‌ఎస్‌కు బీటీమ్‌: ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ సర్కార్‌పై మండిపడుతున్నారు . దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆయన విమర్శించారు. గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్న ఆయన దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలు చెప్తున్నాయని తెలిపారు. ఇక జనాభా పరంగా చూసుకుంటే రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

<strong>తెలంగాణ మంత్రికి చేదు అనుభవం.. వివాహ వేడుకలో ఊహించని షాక్..</strong>తెలంగాణ మంత్రికి చేదు అనుభవం.. వివాహ వేడుకలో ఊహించని షాక్..

రైతు బంధు ఎన్నికల బందుగా మారిందని విమర్శలు

రైతు బంధు ఎన్నికల బందుగా మారిందని విమర్శలు

ఇప్పటి వరకు రైతులకు ఋణం మాఫీ ఎందుకు చెయ్యలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . రైతు బంధు ఎన్నికల బందుగా మారిందని విమర్శించారు. ఇక రైతుల కోసం ప్రభుత్వం చేస్తుంది ఏంటో చెప్పాలని దీనిపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పంటలకు మద్దతు ధరలు పెంచడం లేదు కానీ లిక్కర్ ధరలు జోరుగా పెంచుతున్నారని విమర్శించారు . కాళేశ్వరం నుంచి ఏటా 530 టీఎంసీలు ఎత్తిపోస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్న రేవంత్ 180 టీఎంసీలకు మించి ఎత్తిపోయలేదని టీఆర్ ఎస్ సర్కార్ చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు .

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Pollution Free Hyderabad | Nithyananda
‘మై హోమ్‌' రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి భేటీ వెనుక బీజేపీ నేతలు

‘మై హోమ్‌' రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి భేటీ వెనుక బీజేపీ నేతలు

ఇక అంతే కాదు బీజేపీ టీఆర్ఎస్ కు బీ టీమ్ లా పని చేస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. .. ‘మై హోమ్‌' రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి భేటీ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఇక బీజేపీ దానిపై స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌, రామేశ్వర్‌రావు ఇచ్చే కమిషన్లకు బీజేపీ నాయకులు కక్కుర్తి పడ్డారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

రామేశ్వర్ రావుతో బీజేపీ నేతల ఆర్ధిక లావాదేవీలు .. మండిపడిన రేవంత్

రామేశ్వర్ రావుతో బీజేపీ నేతల ఆర్ధిక లావాదేవీలు .. మండిపడిన రేవంత్

మై హోమ్ రామేశ్వరరావు కేంద్ర మంత్రిని కలిసింది జైజ్యోతి సిమెంట్స్‌ను తిరిగి తెరిపించి తనకు ఆర్థిక ప్రయోజనం కలిగించుకోటానికే అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి . మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌రావును మైనింగ్‌ మినిస్టర్‌తో సమావేశపరిచారని అసలు బీజేపీ నేతలకు మై హోం రామేశ్వరరావు తోఉన్న లావాదేవీలు ఏమిటని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌కు బీటీమ్‌గా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. తెలంగాణా రాష్ట్రంలో రానున్న బడ్జెట్ లో అయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయింపులు ఉండాలని , రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు .

English summary
Revanth Reddy questioned the government as to why the farmers have not waived the loan. Crop support price has not been raised but Liquor price has been raised criticized for raising prices. He criticized the BJP works as B team for TRS. He alleged that BJP state president Laxman played a key role in the meeting of Union Home Minister Prahlad Joshi and my home rameshwar rao .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X