• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎగిసిపడ్డ ఉద్యమం.!రాళ్లకు తలవంచిన తూటాలు.!మానుకోట రాళ్ల దాడి ఘటనకు పన్నెండేండ్లు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఊపందుకున్న తెలంగాణ ఉద్యమం ఊపిరులను సైతం లెక్క చేయకుండా లక్ష్యాన్ని ఛేదించింది. యావత్ భారత దేశ దృష్టిని మరల్చిన మానుకోట రాళ్ల ఘటన తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. ధైర్యం, మొక్కవోని ఆత్మవిశ్వాసం, తెగింపు, స్వపరిపాలన కాంక్ష, శత్రువును ఎదుర్కొనాలనే పట్టుదల అనే అంశాలన్నీ తెలంగాణ ఉద్యమకారులకు మరొక్కసారి చూపించింది మానుకోట రాళ్ల ఘటన. తెలంగాణ సాధన ప్రక్రియలో వెనకడుగు వేయబోమని, ప్రాణాలైనా అర్పించి తెలంగాణ సాధించుకుటామనే సంకేతాలనిచ్చింది మానుకోట ఘటన. మానుకోట రాళ్ల దాడి ఘటన శనివారంతో పన్నండేళ్లు పూర్తి చేసుకుంటుంది.

మానుకోట రాళ్ల దాడి..

మానుకోట రాళ్ల దాడి..

తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా సాగుతున్న ఉద్యమంలో మానుకోట రాళ్ల దాడి చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఒకపక్క గోబ్యాక్ అంటు నినాదాలు, మరోపక్క ఉద్యమకారుల రాళ్ల వర్షంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చడమే కాకుండా మానుకోట రైల్యే స్టేషన్ రణ రంగంగా మారింది. అది చూసి పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించే ప్రయత్నం చేసారు.

అయినా లెక్క చేయని తెలంగాణ నవ యవ్వన ఉద్యమ కారుల నినాదాలతో ఆ ప్రాంతమంతా కురుక్షేత్రంగా మారి ఉద్యమకారుల రక్తంతో తెలంగాణ గడ్డ తడిసి మానుకోట మట్టిని స్పృశించింది. చారిత్రాత్మకమైన ఆ ఘటనకు శనివారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది తెలులుకునే ప్రయత్నం చేద్దాం.

తెలంగాణ సాధనలో మానుకోట ప్రత్యేక స్థానం..

తెలంగాణ సాధనలో మానుకోట ప్రత్యేక స్థానం..

ఒకప్పటి మానుకోట ప్రస్తుత మహబూబాబాద్ తెలంగాణ సాధన పోరాటంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో జరిగిన మానుకోట రాళ్ల దాడికి శనివారంతో పన్నెండేళ్లు పూర్తి అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకలజనులు ఏకమై ఉద్యమాన్ని సాగిస్తున్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. ఆంధ్ర పెత్తనం నుండి విముక్తి కలగాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే దీనికి పరిష్కారం అని భావించి తెలంగాణ ప్రజలంతా ఉద్యమన్ని కదం తొక్కించారు.

 ప్రత్యేక రాష్ట్ర కాంక్ష..

ప్రత్యేక రాష్ట్ర కాంక్ష..

వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సాక్షిగా ప్ల కార్డులను ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్దంగా వ్యవహరించారనే కారణంతో ఆయన మీద తెలంగాణ వాదులు వ్యతిరేకత రెట్టింపుచేసుకున్నారు. తెలంగాణ సిద్దిస్తుందో సిద్దించదో అనే ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో జగన్ ఓదార్పు యాత్ర మరింత ఆగ్రహావేశాలను రగిల్చింది. మహబూబాబాద్ నుండి ప్రారంభించాలనుకున్న ఓదార్పు యాత్ర ఉద్యమకారులను మరింత రెచ్చగొట్టేలా చేసింది.

 రణరంగంగా మారిన ఓదార్పు యాత్ర..

రణరంగంగా మారిన ఓదార్పు యాత్ర..

స్వరాష్ట్రం కోసం ఆందోళనలు ఉద్యమాలతో అట్టుడికిపోతున్న తెలంగాణ ప్రాంతం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలో ఓదార్పు యాత్ర కొనసాగనవ్వబోమని, అడ్డుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు ఉద్యమకారులు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు రైలులో బయలుదేరి మానుకోటకు వస్తున్నాడని తెలిసి ఒక్కసారిగా ఉద్యమకారులంతా రైల్వేస్టేషన్ చుట్టుముట్టారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మొహరించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా ఆగని ఉద్యమకారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగి జగన్ గోబ్యాక్ అంటూ దిక్కులు పక్కటిల్లేలా నినాదాలు చేస్తూ పట్టాల పైకి దూసుకొచ్చారు.

 కురుక్షేత్రాన్ని మరిపించిన రైల్వేష్టేషన్..

కురుక్షేత్రాన్ని మరిపించిన రైల్వేష్టేషన్..

రైలు స్టేషన్ కు సమీపిస్తుందని తెలియగానే ఉగ్రరూపం దాల్చిన ఉద్యమకారులు అధిక సంఖ్యలో వచ్చి మొత్తం రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని ముట్టడించారు. పోలీసులు అదుపు చేయాలనే ప్రయత్నం చేసినా ఫలితం ఏమాత్రం కనిపించలేదు. ఒక్కసారిగా ఉద్యమకురుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది, ఉద్యమం అకస్మాత్తుగా ఉధృతమైంది. ఉద్యమకారులు ఒక పక్క రాళ్ల దాడికి దిగాగా, పోలీసులకు ఉద్యమకారులకు మధ్య తీవ్రస్థాయిలో యుద్ద వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఉద్యమకారులు రాళ్ల దాడికి పూనుకున్నారు. మరోపక్క పోలీసులు కాల్పులు మొదలు పెట్టారు. రాళ్ల దాడికి తూటాలు తలవంచాయి. ఇది మానుకోట రాళ్లదాడి చరిత్ర.

English summary
The Manukota incident signaled that we will not back down in the process of practicing Telangana and that we will achieve Telangana by sacrificing our lives. The Manukota stone attack incident will complete twelve years by Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X