వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా గెలిచినా.. అక్కడ బీజేపీకి షాక్: పంకజ రాజీనామా, నో చెప్పిన చీఫ్

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. అయితే వర్లిలో మాత్రం ఎదురు గాలి వీచింది. పర్లి మున్సిపాలిటీలో 10 స్థానాలకు గాను బీజేపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలుపొందింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. అయితే వర్లిలో మాత్రం ఎదురు గాలి వీచింది. పర్లి మున్సిపాలిటీలో 10 స్థానాలకు గాను బీజేపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలుపొందింది.

ఇక బీద్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పర్లి నియోజకవర్గంలో మొత్తం నాలుగు స్థానాల్లో బీజేపీ ఓటమి చవి చూసింది. ఎన్సీపీ మూడు, కాంగ్రెస్ పార్టీ ఒక చోట గెలిచాయి.

 BMC election results 2017: Pankaja Munde resigns

బీజేపీ దివంగత నేత గోపినాథ్ ముండేకు మంచి పట్టున్న ప్రాంతం పర్లీ. ఇక్కడి నుంచి ఆయన కూతురు పంకజ ముండే అసెంబ్లీకి వచ్చారు. మంత్రిగా కొనసాగుతున్నారు.

పర్లిలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పంకజ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించారు. ఆమె రాజీనామాను తిరస్కరించే అవకాశముంది.

ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!

మహారాష్ట్ర పార్టీ చీఫ్ రావ్ సాహెబ్ దన్వే మాట్లాడుతూ.. పార్టీలో, ప్రభుత్వంలో పంకజ స్థానం విలువైనదని చెప్పారు. ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆమెతో మాట్లాడి నచ్చచెబుతామన్నారు.

English summary
Maharashtra minister Pankaja Munde offered to resign after the BJP put up a poor show in the local body polls in her constituency in Beed district. She said that she had already sent in her resignation as woman and child welfare minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X