వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం సోమశిల పర్యాటకం: పడవ యాత్రను ప్రారంభించిన మంత్రులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పర్యాటకరంగంలో సోమశిల ఎకోటూరిజం తొలిపుటలను ప్రారంభించింది. కృష్ణమ్మ ఒంపుసొంపుల నడుమ పయనిస్తూ నది అందాలను తిలకించే భాగ్యం పర్యాటకులకు దక్కింది. హైదరాబాద్ నుంచి 155 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించే కృష్ణానది ముఖద్వారంగా సోమశిల గ్రామం ఉంది.

ఎంతో ఎతైన కొండపై ఈ గ్రామం ఉంది. ఇక్కడి నుంచి చూస్తే నిండైన నీటితో, ఎతైన కొండలతో, పచ్చికబయళ్లతో కృష్ణానది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కర్నూలులో ఉన్న శ్రీశైలం ఆలయానికి 60కిలోమీటర్లు పడవలో ప్రయాణం అత్యద్భుతంగా సాగుతుంది. ఎత్తైన కొండల మీదుగా శ్రీశైలం వెళ్లడానికి రెండున్నరనుంచి మూడు గంటలు పడుతుంది. ఈ 60 కిలోమీటర్ల ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

సోమవారం రాష్ట్ర పర్యటక, అటవీశాఖల మంత్రి చందూలాల్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాలమూరు జిల్లా సోమశిలలో ఈ యాత్రా మార్గాన్ని ప్రారంభించారు. సోమశిల వద్ద, వీపనగండ్ల మండలం జటప్రోలులో కొత్తగా నిర్మించిన హరిత హోటళ్లను మంత్రి చందూలాల్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి బస్సులో బయలుదేరి కొల్లాపూర్‌ మండలం సోమశిల చేరుకొని, ఇక్కడి నుంచి లాంచీలో శ్రీశైలం చేరుకునేలా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వరకు ఇదే తీరులో తిరుగు ప్రయాణం చేయొచ్చన్నారు.

ఈ మార్గంలో మొత్తం 110 కిలోమీటర్ల దూరం నదిలో ప్రయాణం చేసి మంచి అనుభూతి పొందవచ్చన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. స్వదేశీ భారత్‌ దర్శన్‌ కింద రూ.99 కోట్లతో పాలమూరు జిల్లాలో అక్కమహాదేవి గుహలు, కదలీవనం, సోమశిల, జటప్రోలు, ఫర్హాబాద్‌, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం ప్రాంతాలతోపాటు జిల్లాలోని ఇతర ఆలయ సమూహాలను కలుపుతూ పర్యటక క్షేత్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను పర్యటక రంగానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర పర్యటక రంగ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పేర్వారం రాములు మాట్లాడుతూ.. కృష్ణా పరీవాహకంలోని అటవీ ప్రాంతాన్ని ట్రెక్కింగ్‌, ఇతర విజ్ఞాన క్రీడలకు నిలయంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

కార్యక్రమంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు కొత్తగా ఏర్పాటుచేసినలాంచీలో కృష్ణానదిలో కొంతదూరం ప్రయాణించి అనుభూతిని ఆస్వాదించారు.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

పర్యాటకరంగంలో సోమశిల ఎకోటూరిజం తొలిపుటలను ప్రారంభించింది. కృష్ణమ్మ ఒంపుసొంపుల నడుమ పయనిస్తూ నది అందాలను తిలకించే భాగ్యం పర్యాటకులకు దక్కింది.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

హైదరాబాద్ నుంచి 155 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించే కృష్ణానది ముఖద్వారంగా సోమశిల గ్రామం ఉంది. ఎంతో ఎతైన కొండపై ఈ గ్రామం ఉంది. ఇక్కడి నుంచి చూస్తే నిండైన నీటితో, ఎతైన కొండలతో, పచ్చికబయళ్లతో కృష్ణానది కనిపిస్తుంది.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

ఇక్కడి నుంచి కర్నూలులో ఉన్న శ్రీశైలం ఆలయానికి 60కిలోమీటర్లు పడవలో ప్రయాణం అత్యద్భుతంగా సాగుతుంది.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

ఎత్తైన కొండల మీదుగా శ్రీశైలం వెళ్లడానికి రెండున్నరనుంచి మూడు గంటలు పడుతుంది. ఈ 60 కిలోమీటర్ల ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

సోమవారం రాష్ట్ర పర్యటక, అటవీశాఖల మంత్రి చందూలాల్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాలమూరు జిల్లా సోమశిలలో ఈ యాత్రా మార్గాన్ని ప్రారంభించారు.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

సోమశిల వద్ద, వీపనగండ్ల మండలం జటప్రోలులో కొత్తగా నిర్మించిన హరిత హోటళ్లను మంత్రి చందూలాల్‌ ప్రారంభించారు.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి బస్సులో బయలుదేరి కొల్లాపూర్‌ మండలం సోమశిల చేరుకొని, ఇక్కడి నుంచి లాంచీలో శ్రీశైలం చేరుకునేలా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వరకు ఇదే తీరులో తిరుగు ప్రయాణం చేయొచ్చన్నారు.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

ఈ మార్గంలో మొత్తం 110 కిలోమీటర్ల దూరం నదిలో ప్రయాణం చేసి మంచి అనుభూతి పొందవచ్చన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు.

సోమశిల పర్యాటకం

సోమశిల పర్యాటకం

స్వదేశీ భారత్‌ దర్శన్‌ కింద రూ.99 కోట్లతో పాలమూరు జిల్లాలో అక్కమహాదేవి గుహలు, కదలీవనం, సోమశిల, జటప్రోలు, ఫర్హాబాద్‌, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం ప్రాంతాలతోపాటు జిల్లాలోని ఇతర ఆలయ సమూహాలను కలుపుతూ పర్యటక క్షేత్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

English summary
The administration on Monday set the ball in motion to give a major boost to tourism by launching boating services at Somasila, in the backwaters of the River Krishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X