boora narsaiah goud trs kcr cm candidate 2019elections బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కేసీఆర్ సీఎం అభ్యర్థి
2019లో కేసీఆర్ 'సీఎం అభ్యర్థి' కాదా?: టీఆర్ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: వచ్చే 2019 ఎన్నికలపై టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారితే.. ప్రస్తుత సీఎం కేసీఆర్
ఎవరిని సూచిస్తే వారు.. అప్పుడు రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపడుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2019లో టీఆర్ఎస్ తరుపున ఎవరు సీఎం అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుందన్న బూర వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వచ్చే దఫాకు 'కేసీఆర్' సీఎం పదవికి దూరంగా ఉండబోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన కేంద్రంలో చక్రం తిప్పే వ్యూహాంలో ఉన్నారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారాయి. టీఆర్ఎస్ పాలిటిక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బూర నర్సయ్య.. కాంగ్రెస్ రాజకీయాలను విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను ప్రజల ఆవేదనగా చెబుతున్నారని బూర నర్సయ్య విమర్శించారు. ప్రజలు ఓటేస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారని.. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు సోనియా వల్ల కాదని అన్నారు. టీ.కాంగ్రెస్ లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.
నోట్ల రద్దు అంశాన్ని కూడా ప్రస్తావించిన ఆయన.. దానిపై తాము ఏకపక్షంగా మోడీ నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో రావుల పాలన కొనసాగుతుందంటూ కొంతమంది విమర్శలు చేయడం సబబు కాదన్నారు.