హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పథకం ప్రకారమే: మద్యం, మగువను ఎరగా వేసి రౌడీషీటర్‌ దారుణ హత్య

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సనత్‌నగర్ బోరబండకు చెందిన రౌడీషీటర్ సయ్యద్ వాహెద్ (35) జహీరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడు. వాహెద్‌ను జహీరాబాద్ శివారులోని ఫాంహౌజ్‌లో ప్రత్యర్థులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సెటిల్‌మెంట్లలో వచ్చిన విభేదాలతోనే సన్నిహితులే వాహెద్‌ను చంపినట్టు తెలుస్తోంది.

శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక బృందావన్ కాలనీ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌లో ఈ హత్య జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం ప్రకారం నగరంలోని బోరబండ పండిట్ నెహ్రూనగర్‌కు చెందిన పహిల్వాన్ వాహెద్‌పై సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఓపెన్ అయింది.

ఇతడిపై 11 కేసులున్నాయి. మూడు హత్యలు, మరో మూడు రేప్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన సెటిల్‌మెంట్ల కోసం కొంతమంది యువకులతో కలిసి గ్రూపును నిర్వహిస్తున్నాడు. సనత్‌నగర్ ప్రాంతంలో ఆగడాలు పెరిగిపోవడంతో ఏడాది క్రితం పోలీసులు పీడీ యాక్డు కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఈ నెల 4న జైలు నుండి విడుదలైన వాహెద్ తిరిగి తన గ్రూపులోని ఫిరోజ్, రహీంలను కలుసుకున్నాడు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫిరోజ్ తల్లి అల్లాపురం డివిజన్ నుంచి పోటీ చేసింది. అయితే ఆమె ఓటమికి వాహెదే కారణమని ఫిరోజ్ కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంలో వాహెద్, ఫిరోజ్‌లు పలు సందర్భాల్లో గొడవపడ్డారు కూడా.

అ సమయంలోనే మిమ్మల్ని చంపేస్తా.. అంటూ వాహెద్, రహీంలను బెదిరించాడు. ఈ నేపథ్యంలో తామే వాహెద్‌ను చంపేద్దామని ఫిరోజ్, రహీం ప్లాన్ వేసుకున్నారు. ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం సిటీ బయట మంచి విందుచేసుకుందామని ఇద్దరూ కలిసి వాహెద్‌తో ఫిరోజ్, రహీం చెప్పారు.

ఈ క్రమంలో జహీరాబాద్ మండలం హోతీ(కె) గ్రామ సమీపంలో బీదర్‌కు చెందిన రియల్ వ్యాపారి ఫాంహౌజ్‌కు ఆదివారం సాయంత్రం వెళ్ళారు. వాహెద్ మనుషులు, ఫిరోజ్ మనుషులు ఎవరికి వారు 5 వాహనాల్లో మొత్తం 15 మంది వచ్చారు. ఫిరోజ్, అతడి మనుషులతో కలిసి గదిలో కూర్చుని వాహెద్ మద్యం తాగాడు.

వాహెద్ అనుచరులు మాత్రం ఫాంహౌజ్ బయట కూర్చుని తాగారు. అందరూ పూర్తిగా మత్తులోకి జారుకోగానే వెంట తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లలో ఫిరోజ్, రహీంలు వాహెద్‌ను 2.30 గంటల ప్రాంతంలో దారుణంగా నరికి చంపారు. వాహెద్‌ను హత్యచేశారని తెలుసుకున్న అతడి స్నేహితులంతా రాత్రికి రాత్రే బస్సుల్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు.

పరారీలో నిందుతులు

పరారీలో నిందుతులు


రహీం, ఫిరోజ్‌లు కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, జహీరాబాద్ పట్టణ సీఐ నాగరాజ్, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా వాహెద్‌ను హత్యచేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బీదర్‌కు చెందిన ఫాంహౌస్ యజమాని పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తిరుపతన్న వివరించారు.

హత్యకు గురైన సమయంలో వాహెద్ ఒంటిపై దుస్తులు లేవు

హత్యకు గురైన సమయంలో వాహెద్ ఒంటిపై దుస్తులు లేవు


వాహెద్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసిన ఫిరోజ్ మద్యం, మగువలను ఎరివేసినట్టు తెలుస్తోంది. ఈ విందు పార్టీలో 25 మంది వరకు ఉండి ఉంటారని, వారిలో మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు బావిస్తున్నారు. ఒక మహిళను గదిలోకి పంపించిన అనంతరం ఫిరోజ్ మనుషులు వాహెద్‌పై దాడి చేసి ఉండొచ్చని తెలిపారు. హత్యకు గురైన సమయంలో వాహెద్ ఒంటిపై దుస్తులు లేవు. మహిళనకు సంబంధించిన వస్త్రాలు కూడా సంఘటనా స్థలంలో పడి ఉన్నాయి.

 ఒప్పందానికి పిలిచి చంపేశారు

ఒప్పందానికి పిలిచి చంపేశారు


తన భర్తను కొందరు నమ్మించి జహీరాబాద్ తీసుకువచ్చి హత్యచేశారని మృతుడి భార్య రహేనా బేగం కన్నీళ్లు పెట్టుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

 నెహ్రూనగర్‌లో పోలీసుల బందోబస్తు

నెహ్రూనగర్‌లో పోలీసుల బందోబస్తు

పహిల్వాన్ వాహెద్ మరణవార్త తెలిసి కుటుంబసభ్యులు, అతని అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. బోరబండ పండిట్ నెహ్రూనగర్‌లో దుకాణాలను మూసివేశారు. మందుస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పండిట్ నెహ్రూనగర్ లోని మృతుడి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Notorious rowdy sheeter Syed Wahed alias Wahed Pahilwan was murdered by his aides in Zaheerabad on Sunday midnight. Wahed and his aides had gone to Zaheerabad to attend a party thrown at a farmhouse by one Feroz, who is also a rowdy sheeter. Police suspect that Feroz and his friend Rahim allegedly axed Wahed after he got drunk. Wahed was released from prison in July after he was detained under PD Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X