వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సంచలనాలు మాని, బాధ్యతతో మెలగాలి’, గుడికెళ్తే తప్పేంటి?: నరసింహన్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనాలకు స్వస్తి పలికి, ఎప్పుడూ విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా.. సలహాలూ ఇవ్వాలని గవర్నర్ నర్సింహన్ మీడియాకు హితవు పలికారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి కెటి రామారావు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ నర్సింహన్ మాట్లాడుతూ.. బ్రేకింగ్ న్యూస్ పేరిట సంచలనాలకు స్వస్తి పలకాలని, బాధ్యతతో మెలగాలని అన్నారు. తాము దేనికైనా అతీతులమని మీడియా ప్రతినిధులు భావించ కూడదని, సమాజంలో భాగమేనని గ్రహించాలన్నారు.

తాను గుళ్లు, గోపురాలకు వెళితే తప్పేమిటని నర్సింహన్ ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకెళుతున్నారని అంటారని, భార్యను తీసుకెళితే తప్పేమిటన్నారు. మీడియా వార్తలనూ సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. మీడియాలో సంస్కరణలు రావాలని, 45 రోజులకు ఒకసారి మీడియాకు వివిధ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ప్రెస్‌క్లబ్ నిర్వాహకులకు సూచించారు.

తాను చాలావరకు మీడియాకు దూరంగా ఉన్నానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోరాదని, మళ్లీ హెడ్‌లైన్స్‌లో చూపించవద్దని ఆయన కోరారు. 47ఏళ్లుగా వివిధ పదవులు నిర్వహించిన అనుభవంతో చెప్పిన వాటిని సానుకూలంగా తీసుకోవాలని గవర్నర్ మీడియాను కోరారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జర్నలిజంలో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైందన్నారు. వార్తల విషయంలో యాజమాన్యం ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ ఉండాలని అన్నారు.

జర్నలిస్టులకు రక్షణ ఉండాలని, వేజ్‌బోర్డు అమలు చేయాలని ఆయన చెప్పారు. జర్నలిస్టులకు మాడల్ గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే తామూ సహకరిస్తామని దత్తాత్రేయ తెలిపారు.

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

సంచలనాలకు స్వస్తి పలికి, ఎప్పుడూ విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా.. సలహాలూ ఇవ్వాలని గవర్నర్ నర్సింహన్ మీడియాకు హితవు పలికారు.

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి కెటి రామారావు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ఈ సందర్భంగా గవర్నర్ నర్సింహన్ మాట్లాడుతూ.. బ్రేకింగ్ న్యూస్ పేరిట సంచలనాలకు స్వస్తి పలకాలని, బాధ్యతతో మెలగాలని అన్నారు. తాము దేనికైనా అతీతులమని మీడియా ప్రతినిధులు భావించ కూడదని, సమాజంలో భాగమేనని గ్రహించాలన్నారు.

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

అస్సాంలో బాంబు పేలుడు ఘటనలో తన సోదరుడు మరణిస్తే అక్కడికి వెళ్లినప్పుడు మీడియా ఎదురై, ‘ఆప్‌కో కైసా లగ్‌తాహై..'(ఈ ఘటనపై మీకు ఎలా అనిపిస్తుంది?) అని ప్రశ్నించడంతో తాను నివ్వెరపోయానని అన్నారు.

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలు

రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదించేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడి మీడియా ఎదురైందని, కేంద్రానికి తాను 35పేజీల నివేదిక సమర్పించినట్లు చెబితే, నివేదిక కాపీ(ప్రతి) కావాలంటూ మీడియా ప్రతినిధులు అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలని అన్నారు.

రాష్ట్ర ఐటి మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమ నిధికి తాము ఇదివరకే 10 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జర్నలిస్టులకు సమకూరని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. త్వరలో హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో జర్నలిస్టు భవన్ నిర్మించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అంశం పరిశీలనలో ఉందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను సమానంగా చూస్తామని అన్నారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు.

English summary
Members of the Fourth Estate here on Sunday drew bouquets and brickbats from Governor E.S.L. Narasimhan at the Golden Jubilee celebrations of the Press Club, Hyderabad (PCH), an organisation that has the crème de la crème among its 1,000-odd members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X