వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌లో బుధవారం జరిగింది.

|
Google Oneindia TeluguNews

జగిత్యాల: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌లో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన తీట్ల లింగమూర్తి (13) ఇటిక్యాల మోడల్‌ స్కూల్‌లో నైన్త్‌ క్లాస్‌ చదువుతున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన తీట్ల లక్మి అనే వృద్ధురాలు లింగమూర్తిని 12 ఏళ్ల క్రితం దత్తత తీసుకుంది. మంగళవారం సెల్‌ఫోన్‌ కొనివ్వాలంటూ అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై బుధవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 A boy allegedly committed suicide for cell phone

అయ్యో బిడ్డల్లారా... గుండెపోటుతో నానమ్మ మృతి, అనాథలైన మనుమరాళ్లు

వరంగల్‌ రూరల్‌: జీవితంలో కష్టాలు ఎదురుక్కొంటూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు జన్మించాక.. మానసిక ఇబ్బందులతో మరణించిన కుమారుడు.. ఇద్దరు చిన్నపిల్లలను వదిలి వెళ్లిపోయిన తల్లి.. తన రక్త సంబంధాన్ని వదులుకోలేని వృద్ధురాలు పసిపిల్లలను తన అక్కున చేర్చుకొని సాకుతున్న వేళ... అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెండడంతో అనాథలైన ఆ బాలికలను చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యాంతమయ్యారు.

ఈ హృదయవిదారక సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాత మగ్గుంపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన మహమ్మద్‌ యాకూబీ(75) మహమ్మద్‌ జానీ దంపతులు. వీరికి కుమారుడు సలీం పాషా, కూతురు బేగంలు జన్మించాక 40 సంవత్సరాల క్రితం జానీ అనారోగ్యంతో మృతి చెందాడు.

యాకూబీ హోటల్‌ నడుపుతూ కుమారుడిని, కూతురుని పెంచి వివాహాలు చేసింది. ఈ క్రమంలో సలీంకు ఇద్దరు కూతుళ్లు సదా, సనాలు జన్మించారు. అయితే సలీం మనోవేదనతో 12 సంవత్సరాల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందిన కొద్ది రోజులకే యాకూబీ కోడలు ఇద్దరు కూతుళ్లను వదిలి వెళ్లిపోయింది. దీంతో మనుమరాళ్లు అనాథలు కావొద్దని హోటల్‌ నడుపుతూ పిల్లలను పోషిస్తూ చదివిస్తోంది. వారు ఇప్పుడు 6, 7 తరగతులు చదువుతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున సదా, సనాలు నానమ్మను లేపడానికి ప్రయత్నం చేయగా లేవకపోవడంతో ఏడుస్తూ బయికి వచ్చారు. హోటల్‌కు చేరుకున్న కొందరు అటు ఇటు కదిలించిన సమయంలో ఒక్కసారిగా లేచి యాకూబీ గుండెపోటుకు గురై మృతి చెందింది. ఆసరా ఉన్న నానమ్మ మృతి చెందడంతో ఇద్దరు మనుమరాళ్లు యాకూబీ మృతదేహంపై పడి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అనాథలైన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

English summary
A boy allegedly committed suicide for not buying cell phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X